శ్రీ కాళీ మహావిద్య (Sri Kali Mahavidya)

English | Hindi | Telugu

Kali Mahavidya

శ్రీ కాళీ మహావిద్య (Sri Kali Mahavidya)

Mata kali Jayanti is celebrated on the Ashweeja Masa shukla Paksha Saptami night (Durga Ashtam during Navarati) also known as kaalratri as per Chandra Manam.

శ్రీ కాళీదేవి అమ్మవారు కృష్ణ వర్ణంతో ప్రకాశించే దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. సమస్త విద్య లకు ఆదిరూపం మహాకాళి. ఆ దేవి విద్యామయ శక్తులనే మహావిద్యలని అంటారు. కృష్ణ వర్ణంలో ఉండటంవల్ల దేవికి కాళీ అనే నామ ఏర్పడింది.

అనేక సంవత్సరములకు కాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది మాసాలలోనో, రోజుల్లోనో సాధించాలనుకొంటే కాళీ ఉపాసన చేస్తారు. కాని కాళీశక్తిని తమ శరీరంలోనికి ఆకర్షిం చుకొనేటప్పుడు అగ్నితో సమాన మైన మంటలని, భయంకరమైన బాధని యోగి అనుభ విస్తారు. అప్పటి నుండి ఆమె శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది.

తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. బ్రహ్మానికి అసలు రూపం. కాల స్వరూపం కాళిక. కాళిక వాక్కుకు శక్తినిస్తుంది.

శ్రీ కాళీదేవి గాయిత్రి:

!! ఓం కాళికాయై చ విద్మహే స్మశాన వాసిన్యై ధీమహి తన్నో ఘోరా ప్రచోదయాత్ !!

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….