web analytics

Aries Horoscope

Aries Horoscope

Aries -మేషం(Mesha) 2021

అశ్వని 4 పా॥లు

భరణి 4 పా॥లు

కృత్తిక 1 వ పాదము

 

Aries Horoscope గురుడు: ఈ సంవత్సరమంతయు ఏకాదశమందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు దశమమందు సంచరించును. రాహు,కేతువులు సంవత్సారాది నుండి రాహువు ద్వితీయ మందు,కేతువు అష్టమమందు సంచరించును.

ఈ మేషం రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితములు గోచరించుచున్నవి. ఈ సంవత్సరం గురుబలం మాత్రమే ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయమునకు ధనము చేకూరును, నూతన వ్యాపారములో పెట్టుబడులు ఋణము చేసి పెట్టుదురు, ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల కోసం కొంత ధనము నిల్వ చేసుకుంటారు, సోదరుల సహాయ సహకారములు వలన అభివృద్ధికార్యక్రమములు చేయుదురు, దశమస్థానంలో శని సంచారం వలన ప్రతి పనియందు విఘ్నములు కలుగుచుండును, అధికముగా శ్రమించినా ఫలితము తక్కువగా ఉండును, సంఘములో గౌరవం తగ్గుట, కొద్దిపాటి శ్రమవలనే అలసట చెందుట, ఉద్యోగభంగము కలుగుట, మానసిక అశాంతి కలుగును.

ద్వితీయ, అష్టమ స్థానములందు రాహుకేతువులు సంచరించుట | వలన కుటుంబ కలహములు, రక్తస్రావము జరుగుట, ఆరోగ్యభంగము,ధనము కొరకు ఇబ్బందిపడుట, వైద్య సేవ కొరకు ధనము ఖర్చు చేయుట, ప్రతీ విషయమునకు ఆందోళన చెందుతూ ఆస్థిమితముగా ఉండుట జరుగును. వాహన గండములు, భయము కలుగును. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ప్రజలచేత తిరస్కారం, గౌరవహాని కలుగును. న్యాయ, వైద్య రంగముల వారికి ఆదాయము బాగుండును. కుటీర పరిశ్రమల, వ్యాపారస్థులకు ఈ సంవత్సరం మధ్యమ ఫలితములు కలుగును. సినీ రంగం వారికి ఈ సంవత్సరం అధికశ్రమ,ఫలితము తక్కువ వుండును. విద్యార్థులు అధిక శ్రమ పడవలసి వచ్చును, చెడు స్నేహములు పెరుగుట, తద్వారా భవిష్యత్తు పాడుచేసుకోకుండా జాగ్రత్త వహించవలెను. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఆశించిన ఫలితములు తక్కువగా వచ్చును, రెండు పంటలు మధ్యమముగా ఉండును.

ఈ రాశివారు ఈ సంవత్సరం శివారాధన, దుర్గా పూజ,చండి పారాయణ,సుబ్రహ్మణ్య ఆరాధన చేయుటవలన శుభ ఫలితములు కలుగును.

చైత్రమాసం (13th April to 11th May) : ఈ మాసమందు ధనలాభము, వస్త్ర లాభము, సంతాన రీత్యా సుఖము, మిత్రుల సహాయ సహకారాలు లభించుట, నూతన వాహనం కొనుగోలు చేయుట, దైవ దర్శనం, చక్కని ఆరోగ్యం , గొప్పవైన పనులు విజయవంతంగా పూర్తి చేయుదురు.

వైశాఖ మాసము (12th May to 10th June) : ఈ మాసమందు మిశ్రమ ఫలితములు గోచరించుచున్నవి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నూతన వస్తు, వాహన, వస్త్రములు కొనుగోలు చేయుదురు. చక్కని భోజనము, సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేయుట, కొద్దిపాటి అనారోగ్యం బాధించును.

జేష్ఠ మాసం (11th June to 10th July) : ఈ మాసము మిశ్రమ ఫలితములు కలుగును. నూతన ఉద్యోగము మరియు అధికారుల మెప్పు పొందుతారు. ధన లాభం, నూతన వాహనం కొనుగోలు చేయుట, అధికంగా ధనం ఖర్చు, కొద్దిపాటి మానసిక శాంతి కలుగును.

శ్రావణమాసం (9th August to 7th September) : ఈ మాసము గ్రహస్థితి అనుకూలముగా లేనందున వైరాగ్య భావనలు కలుగును. విపరీతమైన ఖర్చులు, అనారోగ్యం, నిందలు, అగౌరవం కలుగును. దైవ అనుగ్రహం కొరకు ఈ మాసము ప్రయత్నము చేయవలెను.

భాద్రపద మాసము (8th September to 6th October) : ఆరోగ్యము, శత్రు బాధలు నివృత్తి అగుట, ఋణములు తీర్చుట, ఆదాయం అభివృద్ధి, సువర్ణ యోగము కలుగుట జరుగును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : ఈ మాసమందు శుక్ర బుధులు బలం వలన గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, నూతనోత్సాహం, | కార్యసిద్ధి కలుగును. మధ్య మధ్య అనారోగ్యము బాధించును.

కార్తీకమాసము (5th November to 4th December) : ఈ మాసమందు మిశ్రమ ఫలములు కలుగును. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు సాగుతారు. ధర్మ చింతన, పుణ్యకార్యములు, దానధర్మాలు చేయుదురు.

మార్గశిర మాసము (5th December to 2nd January 22) : ఈ మాసమందు గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఉండును. అనుకోని సంఘటనలు జరిగి కష్టము కలిగించును. దైవానుగ్రహం కొరకు ప్రయత్నించవలెను.

పుష్యమాసము (3rd January 22 to 1st February 22) : ఈ మాసమునందు ప్రభుత్వమూలక ధనలాభము, పై అధికారుల ప్రశంశలు మరియు శ్రమకు తగ్గ గుర్తింపు కలుగును. నూతన వ్యాపారమును ప్రారంభించుటకు తగిన మార్గం లభించును, ఆరోగ్యం చేకూరును.

మాఘమాసము (2nd Februrary 22 to 2nd March 22) : ఈ మాసము అనుకూలముగా ఉన్నది. చేయు ప్రతికార్యమునందు విజయము లభించును. బంధు మిత్రుల | సహాయ సహకారాలు లభించును. ధనాదాయం బాగుండును. గృహ,వాహన యోగము కలుగును.

ఫాల్గుణ మాసం (3rd March 22 to 1st April 22) : ఈ మాసమందు ఋణము తీర్చుట, లాభం పొందుట, సోదరుల సహాయ సహకారం వలన సమస్యలు తొలగుట, మానసిక ధైర్యం కలుగును. అనుకున్న పని సాధించగలరనే దైర్యము కలుగును.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande …. 

error: