web analytics

Gemini Horoscope

Gemini HoroscopeGemini మిధునరాశి (Mithuna) 2021

 

మృగశిర 2,3 పా||లు

ఆరుద్ర 4 పా||లు

పునర్వసు 1,2,3 పా||లు

 

Gemini Horoscope గురుడు: ఈ సంవత్సరమంతయు భాగ్యమందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు అష్టమమందు సంచరించును. రాహువు: సంవత్సారాది నుండి వ్యయ మందు, కేతువు షష్టమమందు సంచరించును.

ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితములు కలుగుచున్నవి. పూర్వము నిలిచిపోయిన కార్యములన్నియు క్రమముగా ఫలవంతం అగును. భూలాభము, ప్రభుత్వ కార్యములు అనుకూలించడం మరియు ఉద్యోగ అభివృద్ధి,నూతన ఉద్యోగ ప్రయత్నం ఫలించును. సంతానము కొరకు వేచి ఉన్న వారికి పుత్ర ప్రాప్తి కలుగుట, సంతానము వలన సుఖము మరియు ఊహించని కేశములు కలుగును. మిత్రుల వలన లాభము కలుగును, అధికముగా ఋణములు చేయవలసి వచ్చుట, దూరదేశ ప్రయాణములు, భార్య పిల్లలను వదిలి ఒంటరిగా దూరముగ వెళ్ళుట, సంబంధము లేని విషయములలో తలదూర్చి ఇబ్బందులకు గురి అగుట, కారణం లేకుండానే అందరితో శత్రుత్వం ఏర్పడుట, తెరలు తెరలుగా ఇబ్బందులు ఏర్పడుట, ఉదర పీడ, నేత్ర పీడ, తరుచూ వైద్యుడిని సంప్రదించవలసి వచ్చును.

బద్ధకముచే పనులు కొంత వాయిదా వేయుట, ప్రాచిన ఆలయ దర్శనములు చేయుట, సాధుపురుషులదర్శనం, దాన, ధర్మములు చేయుట, ఋణముచేసి గృహ వాహన వస్తు సామాగ్రిని సమకూర్చుకుందురు. పరిమళ ద్రవ్యములు, వజ్ర ఆభరణములు కొనుట, వివాహం కొరకు ఎదురు చూచు వారికి బంధువుల సహాయముతో ప్రయత్నములు ఫలించును.ప్రియమైన వారి మరణవార్త బాధను కలిగించును. రాజకీయ నాయకులు అవమానములు ఎదుర్కొనవలసి వచ్చును. రియల్ ఎస్టేట్, అన్ని రకాల వ్యాపారులకు, వైద్యులకు లాభదాయకంగా ఉండను. సినీ రంగం వారికి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ విజయం లభించును. మత్స్య పరిశ్రమ వారికి ఆశించిన ఫలితం లభించదు. ఫౌల్టిమరియు పాడి వ్యాపారము చేయు వారికి లాభదాయకము. విద్యార్థులు అధిక శ్రమ వలన ఉత్తీర్ణత సాధించగలరు, వ్యవసాయదారులకు రెండు పంటలు మధ్యమము గా ఉండును.

ఈ రాశివారు శివారాధన మరియు మృత్యుంజయ హోమము, దుర్గారాధన, చండిపారాయణ చేయుట వలన శుభఫలితములు కలుగును.

చైత్ర మాసము (13th April to 11th May) : గృహమునందు శుభ కార్యములు జరుగుట, బంధుమిత్ర సమాగమము, నూతన వస్తు వాహనములు కొనుగోలు చేయుట, స్థిరాస్తి వృద్ధి చేయుట, శరీర బడలిక,అస్తి శూల వలన కొంత బాధను కలిగించును. ఉద్యోగరీత్యా కీర్తి ప్రతిష్టలు పెరుగును.

వైశాఖమాసం (12th May to 10th June: ఈ మాసమున సర్వ కార్యములు సిద్ధించును, ధనాభివృద్ధి, శరీరము పీడ తొలగి ఆరోగ్యము కలుగును. గృహమునందు మంగళ తోరణాలు, బంధుమిత్ర సమాగమము, నూతన వాహనము, సువర్ణలాభము, గృహారంభము, మిత్రుల ప్రశంసలు ఆనందము | నిచ్చును.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July) : పరిమళ ద్రవ్యములు,అలంకరణ వస్తువులు కొనుగోలు చేయుట, రక్త సంభందమైన పీడ, అధికారుల వత్తిడి, ఉద్యోగ భంగము, వాహన ప్రమాదము, నేత్రదోషములు, బంధనము కలుగును.

ఆషాడ మాసం (11th July to 8th August) : శుభ సంబంధమైన కార్యక్రమములలో ఫాల్గొనుట, మానసిక ధైర్యము, అనారోగ్యము నుండి ఉపశాంతి,దైవ దర్శనములు,మాత పితరుల పట్ల శ్రద్ధ వారికి ఆనందము కలుగునట్లు తగిన ఏర్పాటు చేయుట జరుగును.

శ్రావణ మాసము (9th August to 7th September) : గృహమునందు శుభ కార్యములు,మంగళ తోరణములు కట్టుట,బంధుమిత్ర సమాగమము, విందులు వినోదాలలో పాల్గొనుట, అధికారుల ప్రశంశలు,సన్మానములు పొందుట, అధిక ఆదాయము ఆనందమునిచ్చును.

భాద్రపద మాసము (8th September to 6th October) : పితృ దేవతలను సేవించుట,వాహనముల వలన చిక్కులు, గృహమున మార్పులు చేర్పులు చేయుట,తల్లిగారికి అనారోగ్యము,సంతానము వలన ఆనందము కలుగును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : దైవానుగ్రహం కొరకు ప్రయత్నించుట, కుటుంబ అభివృద్ధి కొరకు మంచి నిర్ణములు చేయుట,జ్ఞాతులతో కలయిక,తల్లికి సుఖము,స్వబుద్ధివలన చేయు కార్యము వలన లాభము కలుగును. సోమరితనము ఉండును. ఋణము చేయవలసి వచ్చును.

కార్తీకమాసము (5th November to 4th December) : శైవ క్షేత్ర దర్శనము, ఆదాయ వృద్ధి చేయుటకు చక్కని ఆలోచన చేయుట, స్థిరాస్తి కొనుగోలు చేయుట, ప్రయత్నించిన కార్యములు సాధించుట, వస్త్ర లాభము, సుఖము, సంతోషము, ధాన్య లాభము కలుగును.

మార్గశిర మాసము (5th December to 2nd January 22) : ఋణ,రోగ, శత్రు బాధలు మరియు భయము నుండి విముక్తి కలుగును.మనస్సుకు ప్రశాంతత లభించును,నూతన | కార్యక్రమములు చేపట్టెదరు,దేవాలయ దర్శనము, దాన ధర్మమ్ములు చేయుదురు.

పుష్యమాసం (3rd January 22 to 1st February 22) : ఈ మాసము సంతాన విషయంలో ఆనందము నిచ్చును. కొద్దిపాటి ఆరోగ్య ఇబ్బంది కలిగి వైద్య సేవ అవసరమగును, భార్య భర్తల మధ్య వివాదములు కొంత మేర చికాకు కలిగించును, గొప్పవారి పరిచయములు ఆనందము కలిగించును.

మాఘమాసం (2nd Februrary 22 to 2nd March 22) : గృహమునందు సంతోషకర విషయములు, విందులు, వినోదములు ఆనందమును కలిగించును, శారీరిక బలహీనత, వెన్ను నొప్పి,వాహన విషయములో జాగ్రత్త అవసరము, ఋణములు కొంత తీర్చుట జరుగును.

ఫాల్గుణ మాసం (3rd March 22 to 1st April 22) : అధికారుల వలన లాభము, గుర్తింపు మరియు మన్నన పొందుదురు. పితృవర్గం వారి నుండి దుఃఖ వార్తలు వినుట, చేయు ప్రతి పనిలో ఆటంకములు ఉన్నప్పటికీ దైర్యముతో ముందుకు వెళ్ళెదరు. దైవ దర్శనములు వలన సమస్యలు తొలగును.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande …. 

error: