web analytics

Leo Horoscope

Leo Horoscope

Leo సింహం (Simha) 2021

 

మఖ 4 పా॥లు

పుబ్బ 4 పా॥లు

ఉత్తర 1 వ పాదము

 

Leo Horoscope గురుడు: ఈ సంవత్సరమంతయు సప్తమ మందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు షష్ఠ మందు సంచరించును. రాహువు: సంవత్సారాది నుండి దశమ మందు,కేతువు చతుర్థ మందు సంచరించును.

ఈ రాశివారికి ఈ సంవత్సరం నూతన భూ, గృహ, వాహనలాభము, సంతానరీత్యా సుఖము, అందరిని ఆకట్టుకొనే విధముగా సొగసుగా మాట్లాడుట, అందరితో మిత్రత్వము, పెద్దలయెడల గౌరవము, మాత పితరులకు సేవచేయుట, వారి ఇష్టాఇష్టములు తీర్చుట, దేవ బ్రాహ్మణ భక్తి, చక్కని సమయస్పూర్తి, తెలివితేటలతో ఉన్నత స్థితి పొందుట, బుద్ధివైశద్యం, పాత బాకీలు తీర్చుట, గతములో ఏర్పడిన అనారోగ్య సమస్యలనుండి విముక్తి, కష్టమునకు తగిన ప్రతిఫలము లభించును, ఇష్టమైన వారితో సరససల్లాపము, ప్రేమ ఫలించుట, గృహనిర్మాణము చేపట్టుట, భాగస్వామితో ఆనందముగా విహార యాత్రలు చేయుట, ధనలాభము, దశమ రాహువు వలన ఉద్యోగమునందు చిక్కులు ఉన్నప్పటికీ ఉపాయములతో వాటిని ఎదుర్కొందుదురు, తల్లిగారికి ఆరోగ్యభంగము, సర్పములు, శత్రువుల విషయములో జాగ్రత్తగా నుండవలయును.

వివాహ విజయము, శుభకార్యసిద్ధి, బంధుమిత్రులతో కలయిక, విందులు వినోదములలో పాల్గొనుట ఆనందము కలిగించును. వ్యవసాయదారులకు రెండు పంటలు కలసి వచ్చును. విద్యార్థులు పట్టుదల, కార్యదీక్షతో విఘ్నములను అధికమించి అత్యుత్తమ ఫలితాలు సాధింతురు. న్యాయవాదులు, వైద్యులు, ఉపాధ్యయులు, సినీరంగమువారు, గాయకులు, కళాకారులు, మత్స్య పరిశ్రమ, పౌల్టి, పాడి పరిశ్రమ వ్యాపారస్తులకు, వృత్తి పనివారులకు, రాజకీయ నాయకులు పేరు ప్రఖ్యాతలను ఆర్జించి ధన లాభమును పొందుదురు. క్రీడాకారులు మంచి ప్రోత్సాహముతో విజయము సాధించెదరు.

ఈ రాశివారు రాహు, కేతు గ్రహ జపము, మినుములు, ఉలవలు దానము, చండి పారాయణ, దుర్గా, గణపతి ఆరాధన చేయుట మంచిది.

చైత్రమాసం (13th April to 11th May)  : సర్వ కార్యములు విజయవంతమగును, రాజకీయంగా పలుకుబడి సంపాదిస్తారు, మృష్టాన్న ప్రాప్తి, భాగస్వామితో విభేధము మనసుకు కష్టము కలిగించును, కొద్దిపాటి ఆనారోగ్యము, శక్తి తగ్గుట జరుగును.

వైశాఖ మాసం (12th May to 10th June) : ధన, ధాన్య, వస్త్ర, వాహన, ఆభరణ లాభములను, అధికార పదవి ప్రాప్తి, సమస్తకార్యములు ఫలించును, ఐశ్వర్య వృద్ధి, పూర్వీకుల నుండి రావలసిన ఆస్తి వచ్చుట, వీరు ప్రయత్నించిన కార్యములు అన్ని సఫలీకృతం అగును.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July) : ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, రాజకీయనాయకుల సహకారం. గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున, ఆకస్మిక ధన లాభం, పాత బాకీలు వసూలు అవుతాయి, వీరు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.

ఆషాడ మాసం (11th July to 8th August) : వృధాఖర్చులు, అసహనం, చిన్న విషముకూడా చాల పెద్దగా అనిపించును, ఆనారోగ్యము, వైద్య సేవ, నిందలు పడుట, వాహన ప్రమాద భయము, నిద్రలేమి, అలసట, భాగస్వామి సూచనలు చాల ఉపయోగించును. తద్వారా ధనలాభము కలుగును.

శ్రావణ మాసము (9th August to 7th September) : సంతోషము, ద్రవ్య లాభము, దురవార్తా శ్రవణము, కాలాతిక్రమణ భోజనము, ధనవ్యయము, కీర్తి పెరుగుట, సాధువుల దర్శనము, వివాదములకు దూరముగ ఉండుట మంచిది.

భాద్రపద మాసము (8th September to 6th October) : కుటుంబ కలహములు, ధనవ్యయం, నేత్ర సంబంధ పీడ, తప్పు ప్రతిపాదనలు చేయుట, వర్తక వ్యాపారముల నష్టము, అగ్ని భయము, ప్రాణప్రదమైన వస్తువులు అపహరణకు గురియగుట, దుర్మార్గులతో సహవాసము వారి వలన చిక్కులు కలుగును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : కృషి, వాణిజ్యముల యందు లాభము, ప్రయాణముల వలన లాభము, స్వస్థాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము,నూతన ఉద్యోగము, పదవీ లాభము, శత్రు బాధ నశించును, పెద్దల యడల గౌరవముగా యుండుట జరుగును.

కార్తీకమాసము (5th November to 4th December) : స్నేహితులతో కలియుట, కుమారుల వలన సౌఖ్యము, వస్తు వస్త్ర లాభములు, గృహమున కళ్యాణాది శుభ యోగములు, ధన ప్రాప్తి, పైరు పంటలు కలసి వచ్చుటచే అధిక ఆదాయం,ప్రయాణ విఘ్నములు, కొద్దిపాటి అనారోగ్యము కలుగును.

మార్గశిర మాసము (5th December to 2nd January 22) : ఋణములు చేయుట, సోమరితనము, శరీరము యందు ఉష్ణ సంబంధ వ్రణములు, పిత్త, వాతాది అనారోగ్యములు, సౌఖ్యము తగ్గుట, వ్యాధుల వలన తాపము, నీచ కార్యములకు పాల్పడుట, పశ్చాత్తాపము, మిత్రుల వలన నష్టపోవుట, సరియైన ఆలోచనలు చేయలేక ఇబ్బందిపడుట జరుగును.

పుష్య మాసం (3rd January 22 to 1st February 22) : విహారయాత్రలు, విందులు వినోదములలో పాల్గొనుట, వృత్తి వ్యాపారములలో ఆదాయ మార్గములు పెరుగుట, సంతానం ఉత్తీర్ణతను ఆనందించుట, ధనము నిల్వ జేయుట, శుభవార్తలు, విజయములు ఆనందాన్నిస్తాయి. ఇష్టకార్యసిద్ధి, శరీరము సుఖముగా ఉండుట జరుగును.

మాఘమాసం (2nd Februrary 22 to 2nd March 22) : వడ్డీకి ధనము ఇచ్చి లాభపడుట, భూమి కొనుగోలు, గృహ లాభములు, గృహములు నిర్మించి అధిక ధరలకు విక్రయించడం వలన లాభాలు, ఉద్యోగాభివృద్ధి, రియల్ ఎస్టేటు వ్యాపారులకు లాభాలు, తగాదాలు పరిష్కరింపబడుట. చాకచక్యంగా వ్యవహరించి విజయం సాధిస్తారు.

పాల్గుణ మాసం (3rd March 22 to 1st April 22) : శ్రమతో కూడిన ప్రయాణాలు, జీర్ణకోశ వ్యాధి, ఇరుగుపొరుగు వారితో కలహములు,దుర్వార్తలు వినుట,స్త్రీ సంభోగ శక్తి తగ్గుట,భయము, విద్యార్థులు విద్యా వ్యాసంగములలో రాణించుట, ఇతరుల సలహాలు పాటించి వ్యవహార జయము పొందుట, పుణ్యక్షేత్ర సందర్శనము, ధనము వృధాగా ఖర్చు అగును.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande …. 

error: