web analytics

Pisces Horoscope

Pisces HoroscopePisces మీనం (Meena) 2021

 

పూర్వభాద్ర 4 వపాదము

ఉత్తరాభాద్ర 4 పా॥లు

రేవతి 4,3 పా॥లు

 

Pisces Horoscope గురుడు: ఈ సంవత్సరమంతయు వ్యయమందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు ఏకాదశ మందు సంచరించును. రాహువు: సంవత్సారాది నుండి తృతీయ మందు,కేతువు భాగ్య మందు సంచరించును.

ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమఫలితములు కలుగును. అనుకున్న సమయానికి ధనం చేతికి వచ్చుట, ధనప్రాప్తి, స్త్రీ సుఖము, ఆరోగ్యము, సౌఖ్యవృద్ధి, మనస్సునందు నిర్మలత్వము, ఇష్ట వస్తు ప్రాప్తి, దాస దాసి జన సుఖము, వాహన లాభం, ఋణములు చేయవలసి వచ్చుట, ఇతరులు చేయు మోసము గుర్తించుట, స్తిరాస్తి సంబంధ వ్యవహారములు కొలిక్కి వచ్చును, నూతన విలాసవంతమైన వాహనములు, గృహములు పొందుట, ఆరోగ్యాభివృద్ధి కొరకు ప్రయత్నించుట, రోగ, శత్రువులపై విజయము, కొద్దిపాటి అవమానములు, అధికారుల వలన ఇబ్బందులు, శారీరక ధాతువులు కోల్పోవుట, ప్రయాణములు అధికముగా చేయవలసివచ్చుట, సంఘమున గౌరవము, ఇంటిలో మనశ్శాంతి లేకపోవుట.

నూతన పదవీ యోగము, శుభకార్యములు రీత్యా ధనవ్యయము, ప్రాణహాని, స్థానచలనం ,దైవ దర్శనములు,  తీర్థయాత్రలు చేయుట,సాధువుల దర్శనము,సంతాన రీత్యా చిక్కులు కలుగును.రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉన్నది, న్యాయవాదులకు వైద్యులకు పేరు ప్రతిష్ఠలు లభించును, ఉద్యోగము చేయువారికి ఇబ్బందులు కలుగును, సినీ రంగం వారికి కళాకారులకు చేతి పనివారికి, కష్టించి పని చేయు వారికి లాభము కలుగును, పౌల్టీ మరియు మత్స్య వ్యాపారస్తులకు లాభము కలుగును, వ్యవసాయదారులకు రెండు పంటలు లాభించును, విద్యార్థులకు అధిక శ్రమ వలన విజయము లభించును.

ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రం, ఋణ విమోచన స్తోత్రం, సుబ్రహ్మణ్య ఆరాధన, సుందరకాండ పారాయణ చేయుట మంచిది.

చైత్రమాసం (13th April to 11th May) : ఈ మాసము మిశ్రమ ఫలితములు ఇచ్చును. నూతన ఉత్సాహముతో కార్యములు ప్రారంభించుదురు,శుభ కార్యక్రమము నిమిత్తము ధనము ఖర్చు చేయుదురు, బంధు మిత్రుల కలయిక, వేడుకలో పాల్గొనుట ఆనందము కలిగించును. ఆరోగ్య విషయములో జాగ్రత్త అవసరము.

వైశాఖ మాసం (12th May to 10th June: అధికారుల మన్నలను పొందుట, ధనము విపరీతంగా ఖర్చు అగుట, తల్లి గారికి అనారోగ్యం, వాహన ప్రమాదము, ఊహించని ఖర్చులు, విందులు వినోదాల్లో పాల్గొనుట, మాట జారుట వలన అపనిందలు ఎదుర్కొన వలసి వచ్చును.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July) : స్త్రీల వలన లాభము మరియు ఊహించని సమస్యలు కలుగును, శుభకార్యములలో పాల్గొనుట, ప్రయాణ విఘ్నములు, అలంకార వస్తువులు కొనుగోలు చేయుట, కుటుంబ అభివృద్ధి, బంధువుల కలయిక, తల్లికి సుఖము, సంతోషము, గురువుల అనుగ్రహము, మంచి భోజనం లభించును.

ఆషాడ మాసం (11th July to 8th August) : ఋణ ,రోగ, శత్రుబాధ, భయము నుండి ముక్తి పొందుట, సువర్ణము మొదలగు ఖరీదైన లాభము, సత్కారములు, గొప్ప వారి స్నేహం, నూతన ఉత్సాహం, భార్యా పుత్రులతో విరోధము కలుగును.

శ్రావణ మాసము (9th August to 7th September) : చక్కని ఆరోగ్యం, ఋణములు నుండి విముక్తి, శత్రువులపై విజయం, ఆదాయ అభివృద్ధి, మంచి సుఖము, ప్రయత్నించిన ప్రతి కార్యమునందు విజయం సాధించుట, నూతన వస్త్ర లాభము, శుభ కార్యక్రమములో పాల్గొనుట, విద్య మూలక లాభము కలుగును.

భాద్రపద మాసము (8th September to 6th October) : ఈ మాసము మిశ్రమ ఫలితములు కలుగును. శ్రమతో కూడిన ప్రయాణం, జీర్ణకోశ ఇబ్బందులు, అగౌరవం, పొరుగు వారితో గొడవలు, భార్యతో మనస్పర్ధలు కుత్సితమైన మాటలు మాట్లాడుట, సోదరులతో మాటపట్టింపులు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, సౌందర్య హాని కలుగును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : ఈ మాసము మిశ్రమ ఫలితములు కలుగుచున్నవి. అనారోగ్యంతో ఇబ్బంది పడుట, ప్రతి పనిలో విఘ్నములు, రక్తస్రావము,ధనము వృధాగా ఖర్చు అగుట, విపరీత భయము, దిగులు, దేశాంతర వాసం చేయవలసి వచ్చుట జరుగును.

కార్తీకమాసము (5th November to 4th December) : ఆపదలు ఏర్పడుట,ప్రమాదాలు జరుగుట,పితృవర్గము వారు దైన్యము పొందుట, అనారోగ్యము, మనోవికారం, నూతన వస్త్ర అలంకార ప్రాప్తి, సంతాన రీత్యా సుఖము, ఆనందము కలిగించును.

మార్గశిర మాసము (5th December to 2nd January 22) : ప్రారంభించిన కార్యక్రమము కష్టంతో జయము కలుగును, కార్యసిద్ధి, ప్రయత్నానుకూలత, విజయవంతంగా పనులు పూర్తియగుట, ఆరోగ్యం, శత్రువులపై విజయము,శయ్యా సుఖము, ఉత్తమవస్త్ర లాభం, భార్య,సంతానము కొరకు నూతన వస్తువులు కొనుగోలు చేయుట జరుగును.

పుష్య , మాఘమాసాలు (3rd January 22 to 1st February 22 / 2nd Februrary 22 to 2nd March 22): ఈ రెండు మాసములు అన్ని విధములుగా లాభదాయకముగా ఉన్నది. తలపెట్టిన ప్రతి పని పూర్తియగును, ఉద్యోగ మందు పేరు ప్రతిష్టలు, సంఘములో గౌరవము, చేయు వ్యాపారమునందు లాభము, నూతన గృహ సంబంధమైన పనులుచేపట్టుట, బంధుమిత్ర కలయిక, అధికారులు మన్నలను పొందుట జరుగును.

ఫాల్గుణ మాసం (3rd March 22 to 1st April 22) : ఈ మాసము మిశ్రమ ఫలితములు కలుగుచున్నవి. శుభ సంబంధమైన ధన వ్యయము,సంఘము నందు గౌరవము, అధికారుల వలన లాభము కలుగును.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….

error: