web analytics

Scorpio Horoscope

Scorpio HoroscopeScorpio వృశ్చికం (Vrishschika) 2021

 

విశాఖ 4 పా||లు

అనూరాధ 4 పా||లు

జ్యేష్ఠ 4 పా॥లు

 

Scorpio Horoscope గురుడు: ఈ సంవత్సరమంతయు పంచమమందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు చతుర్థ మందు సంచరించును. రాహువు: సంవత్సారాది నుండి అష్టమ మందు,కేతువు ద్వితీయ మందు సంచరించును.

ఈ రాశి వారికి ఈ సంవత్సరం శని బలం మాత్రమే ఉన్నది. సేవకులు వలన సుఖము, వాహన లాభం, పశువుల సంరక్షణ, పూర్వము చేసిన ఋణములు కొంతమేర తీర్చుట, చాలా కాలం నుంచి బాధిస్తున్న అనారోగ్యము వైద్య సేవచే కుదుట పడుట, శత్రువులపై విజయం, చతుఃచక్రవాహనం కొనుగోలు చేయుట, నూతన వ్యాపారము ప్రారంభము చేయుట, పదిమందికి పని కల్పించుట, గురు రాహు కేతువుల వలన బంధుమిత్ర వర్గములు ద్వారా దుఃఖము, భాగస్వామితో కలహములు, యాచన బుద్ధి, కార్య విఘ్నములు, స్థిరత్వం లేకపోవుట, తేజో నాశనము, వ్యాపారములో నమ్మి మోసపోవడం, మధ్య మధ్య ఆనారోగ్యం, గృహమునకు మరమ్మతులు చేయుట, ధనము వృధాగా ఖర్చగుట, స్థిమితం లేకపోవడం జరుగును.

వివాహ ప్రయత్నములు విఘ్నములు కలుగును, గర్భస్రావము, మంత్ర సిద్ధి, గొప్ప గొప్ప ఆలోచనలు చేయుట, పదిమందికి సలహాలు, సహాయము చేయుట, సేవా కార్యక్రమములో పాల్గొనుట జరుగును. ఈ సంవత్సరం సినీరంగం, అన్ని రంగములలోని కార్మికులకు, చేతి పని చేయు వారికి, కలప వ్యాపారులకు చక్కని ఆదాయం చేకూరును, పేరు ప్రతిష్టలు కలుగును. పౌల్టీ, పాల వ్యాపారస్తులు లాభదాయకంగా ఉండును. న్యాయవాదులకు, వైద్యులకు చక్కని పేరు ప్రతిష్టలు వచ్చును. రాజకీయ నాయకులకు ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశించిన ఫలితములు వచ్చును. ఉపాధ్యాయులకు గౌరవ హాని, స్థాన చలనము కలుగును.

ఈ సంవత్సరం ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రము, దుర్గ దేవి పూజ, చండీ పారాయణ, గణపతి ఆరాధన చేయుటవలన శుభము కలుగును.

చైత్రమాసం (13th April to 11th May) : కుటుంబ అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడతారు, మాతృ సేవ, సొంత ఆలోచనలు వలన లాభము కలుగును, ఇబ్బందులు ఉన్నప్పటికీ గృహమునందు శుభకార్యములు చేయుదురు.

వైశాఖ మాసం (12th May to 10th June: అనారోగ్య, శత్రు ఋణ బాధల నుండి విముక్తి కలుగును, ఆదాయ అభివృద్ధి కొరకు కృషి చేయుదురు, ప్రయత్నించిన కార్యక్రమములు మధ్య మధ్య ఆటంకం ఉన్నప్పటికీ పూర్తి చేయుదురు, ధన లాభము కలుగును.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July) : ఈ మాసము మిశ్రమ ఫలితములు కలుగును. ఊహించని సమస్యలు వలన ఇబ్బందులు కలుగును, ధర్మ చింతన, దైవసంబంధ కార్యక్రమంలో పాల్గొనుట, దానము చేయుట, సేవకులు వలన లాభం పొందుట, అవమానములు, శుభ కార్యక్రమంలో పాల్గొనడం జరుగును.

ఆషాడ మాసం (11th July to 8th August) : పితృ వర్గంవారు దైన్యము పొందుట, ఆరోగ్యము, ఉద్యోగ వ్యాపారములకు ఎన్నో ఇబ్బందులు అవమానములు మనః శాంతి లేకపోవుట, దుర్వార్త వినుట జరుగును.

శ్రావణ మాసము (9th August to 7th September) : అధిక శ్రమ వలన కార్యక్రమములు జరుగును, గృహమునందు శుభ కార్యక్రమములు, ఋణములు చేయుట, శత్రువులపై విజయము, కళత్ర సుఖము, స్త్రీలకు సంబంధించిన విషయములు లాభము కలుగును.

భాద్రపద మాసము (8th September to 6th October) : ఈ మాసము అన్ని విధములుగా లాభం కలుగును, పేరు ప్రతిష్టలు, స్థిరాస్తి కొనుగోలు చేయుట, అనారోగ్యం నుండి ఉపశమనం, చక్కని భోజనము కలుగును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : అధిక ధన వ్యయము, దైవ పూజా కార్యక్రమంలో పాల్గొనుట, గృహమునందు శుభకార్యములు, బంధుమిత్ర సమాగమము, పరిమళ సుగంధ ద్రవ్యములు, వస్త్ర అలంకార ప్రాప్తి. ఉల్లాసము కలుగును.

కార్తీకమాసము (5th November to 4th December) : వృధాగా సంచరించడం, మానసిక అశాంతి, దైవారాధన చేయుట, శరీరమునకు కష్టము, రోగము, అధిక శ్రమ, ఊహించని ప్రయాణం వలననష్టము, అలసట, ఉదర పీడ, అందరితో వైరము కలుగును.

మార్గశిర మాసము (5th December to 2nd January 22) : శుభా కార్యక్రమంలో పాల్గొనడం, బంధు మిత్రుల కలయిక, శరీరము నందు శూలబాధ, విపరీతమైన ఖర్చులు, వృధా ప్రయాణాలు, నేత్ర సంబంధ పీడ, మానసిక దుఃఖము, వర్తక వ్యాపారములలో నష్టము కలుగును.

పుష్య మాసం (3rd January 22 to 1st February 22) : నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలించును, శత్రువుల యొక్క బాధ కొంతమేరకు తగ్గును, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యముతో ఎదుర్కొంటారు.

మాఘమాసం (2nd Februrary 22 to 2nd March 22) : ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా లేనందువల్ల జాగ్రత్తలు తీసుకొనుట మంచిది, దేవాలయ దర్శనము, మిత్రులతో కలసి యాత్రలు చేయుట, వాహన ప్రమాదం, ధనం విపరీతంగా ఖర్చు అగుట, మానసిక ఇబ్బంది, తల్లి గారికి అనారోగ్యం, సోదరులతో కలహములు కలుగును.

ఫాల్గుణ మాసం (3rd March 22 to 1st April 22) : ధైర్యసాహసములు వలన అన్ని కార్యక్రమములు పూర్తి అగును, అందరిలో పేరు తెచ్చుకొందురు, వాహన యోగము, గృహమునందు మార్పులు చేయుట, వ్రాతపని వారికి అన్ని విధములుగా లాభదాయకంగా ఉన్నది, సోదరుల సహాయ సహకారములు అనుకూలించును.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….

error: