Kumbha Rasi Phalalu 2022-2023

Kumbha Rasi Phalalu 2022-2023

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు

Aquarius/Kumbha/కుంభరాశి

(ధనిష్ట: 3,4 పాదము, శతభిషం: 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర: 1,2,3 పాదములు)
(ఆదాయం – 05 వ్యయం – 02 రాజపూజ్యం – 05 అవమానం – 04)

ఈ రాశివారికి గురుడు ఏప్రిల్‌ 13వ తేదీ నుండి ద్వితీయ స్థానమందు లోహమూర్తి ధనహానిని కలుగజేయును. గురుని ధనస్థాన సంచారము వలన మనస్సౌఖ్యం, కీర్తివృద్ధి ధనవృద్ధి, మానవత్వకోణంలో సమస్యలకు పరిష్కారం కనుగొనటం, ధర్మకార్యాలకు పుణ్యకార్యాలకు ధనం వెచ్చించడం, సౌభాగ్య వృద్ధియగును. సంవత్సరారంభమున శుభకార్యముల యందు పాల్గొనుట, ఆడంబరములకై అధిక ధనవ్యయము.

శనైశ్చరుడు ఏప్రిల్‌ 29 నుండి జన్మరాశి స్థానమందు కుంభరాశిలో రజితమూర్తిగా సంచరించును. జూన్‌ 5 నుంచి జులై 12 తేదీల మధ్య ధనిష్ఠ 3వ పాదంలో వక్రించి జన్మరాశిలో సంచరించును. వ్యవహారములలో ఎంతటి క్లిష్టమైన అంశములనైననూ చిటికలో పరిష్కరించగలుగుతారు. చిక్కుముడులను విప్పి సమస్యలను పరిష్కరించగల్డుతారు. విద్యార్థులు మంచి బుద్ధికుశలత జ్ఞాపకశక్తితో రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతరశ్రమ, శ్రమకు తగిన ఫలితములు లేకపోవుట, నిరుత్సాహము, పై అధికారుల ఒత్తిళ్ళు, ఆరోగ్య విషములకై ధనవ్యయము చేయవలసి వచ్చుట జరుగును.

Know More Aquarius/Kumbha/కుంభరాశి 

రాహుకేతువులు ఏప్రిల్‌ 12వ తేదీ నుండి వరుసగా తృతీయ, నవమ స్థానములందు తామ్రమూర్తులుగా సంచరింతురు. సోదరులంటే నచ్చకపోవడం, సోదరవర్గం వారితో పోరువలన యశోనాశము కల్గుట, పశువులు క్షీణించుట జరుగును. సంవత్సర ప్రారంభంలో రెండు మాసములు జన్మరాశి యందు శని సంచరించుచున్నను మూర్తివంతముచే ఎటువంటి చెడు ప్రభావములనీయక, శుభఫలములనే ఇచ్చును. తదుపరి ధనవ్యయము,వృత్తి వ్యాపారముల యందు వ్యతిరేకతలు కల్గును.

ధనిష్ట నక్షత్రంవారు జన్మరాశిలో శని సంచారకాలంలో రుద్రాభిషేకము చేసిన అవాంతరముల నుండి బయటపడతారు. శతభిషం నక్షత్రం వారికి శివతాండవ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరపారాయణ చేయుట మంచిది. పూర్వాభాద్ర వారు రెండు వ్యవస్థల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుటకు దౌత్యకారులుగా రాణిస్తారు. వీరు జగద్దురువైన కృష్ణపరమాత్మను ధ్యానించుట మంచిది.

అదృష్ట సంఖ్య – ‘8’. 2,3,6,9 తేదీల సంఖ్యలు మంగళ, సోమ, శుక్ర వారములతో కలసిన మరింత యోగకరముగా యుండును.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్‌: జన్మరాశియందు గురు సంచారము శిరోభారము, నరముల నిస్సత్తువ, అజీర్ణము ఉదర సంబంధ ఇబ్బందులు, విద్యా విషయములో ప్రతిభ, దేహము కాంతివంతముగా యుండును. పరోపకార బుద్ధి కల్గియుండురు.

మే: మనస్సున సంకటములు తొలగి శరీరారోగ్యము బాగుండును. ఇష్టకామ్యార్థ సిద్ది కల్గును. దానధర్మాలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. బంధుమిత్రులతో సంతోషము, సన్మిత్ర లాభములు కల్గును.

జూన్‌: జన్మరాశి యందు కుజుని సంచారము ఢాంబికములు పలుకుట, క్రియాశీలత్వము లేకపోవుట గృహమున ఛిద్రములు కల్గిననూ ధైర్యముతో ముందుకు సాగెదరు.

జూలై: స్థానచలన సూచనలు, ప్రతీ పని భారంగా సాగుతుంది. గృహమున ఆనందకరమగు వాతావరణము ఉంటుంది. ఉద్యోగ లబ్ది చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలముగా ఉండును. దైవబలం అనుకూలంగా ఉంటుంది.

ఆగష్టు: ధైర్యం ప్రణాళికతో ప్రతిపనిలోనూ ముందడుగు వేస్తారు. విజయలక్ష్యం వైపు దూసుకుపోతారు. గ్రహస్థితి అనుకూలముగా యున్నది. తొందరబాటు నిర్ణయాలుండవు. శుభయోగాలు కలసివస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం.

సెప్టెంబర్‌: మోకాళ్ళ నొప్పులు కొంతవరకు బాధిస్తాయి. ఆరోగ్య విషయాలు మిశ్రమంగా ఉంటాయి. పశుసంపద వృద్ధి అవుతుంది. నిషిద్ధ పదార్ధములను భక్షించుట వలన ఉదర సంబంధ అనారోగ్యము, దైవసంబంధ కార్యాల్లో పాల్గొంటారు.

అక్టోబర్‌: ధనం వృద్ధి, నిల్వ చేయగల్లుతారు. వృత్తివ్యాపారాలు అనుకూలిస్తాయి. సోదరవర్గంతో విభేధము సూచిస్తోంది. రక్తపోటు,మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచగల్లుతారు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది.

నవంబర్‌: గృహనిర్మాణాలు స్తంభిస్తాయి. గృహ వాతావరణం అనుకూలం భోగభాగ్యాలనుభవిస్తారు. సంపద వృద్ధి చేస్తారు. వ్యవసాయదారులకు ప్రతిబంధ వాతావరణాన్ని తట్టుకుని పంటలు కలసివస్తాయి. సంతానం వృద్ధి.

డిసెంబర్‌: దూరప్రయాణాలు కలసివస్తాయి. అధికారపరిధి పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు అనుకూల సమయం. మీ వృత్తివ్యాపారాలు అనుకూలిస్తాయి, గ్రహస్థితి అనుకూలం. పరిశోధనలకు గుర్తింపు వస్తుంది.

జనవరి 2023: విందు వినోదాలకు డబ్బు ఖర్చు చేస్తారు. అయినా ఆకస్మిక ధనలాభం మిమ్ములను వరిస్తుంది. సమస్త సంపదలు వృద్ధి చెందుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

ఫిబ్రవరి: శుభకార్యాలు కలసివస్తాయి. ప్రణాళికతో వ్యూహాలను ఛేదిస్తారు. కార్యజయం కల్గుతుంది. అర్ధాష్టమ కుజస్తంభన వలన కొన్ని వ్యవహార ప్రతిబంధకాలుంటాయి. అధికారుల వేధింపులుంటాయి. వ్యవసాయం అనుకూలం.

మార్చి: సంఘములో గౌరవ మర్యాదలు యళోవృద్ధి, సమస్త కార్యములు సిద్ధిస్తాయి. గొప్పవారితో పరిచయములు రాజదర్శనము,ధనకనక వాస్తు వాహనములు వృద్ధి అవుతాయి. ధారాపుత్రులతో సుఖ సంతోషాలు ఆనందకరమగు వాతావరణము.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….