Mithuna Rasi Phalalu 2022-2023 

Mithuna Rasi Phalalu 2022-2023

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు

Gemini/Mithuna/మిథున రాశి

(మృగశిర : 3,4 పాదములు, ఆరుద్ర : 1,2,3,4 పాదములు, వునర్వసు : 1,2,3 పాదములు)
(ఆదాయం – 11 వ్యయం – 05 రాజపూజ్యం – 02 అవమానం – 02)

ఈ రాశివారికి గురుడు ఏప్రిల్‌ 13వ తేదీ నుండి దశమస్థాన మందు, లోహమూర్తి ధనహానిని, స్థానభ్రంశము, ఉద్యోగంలో ఇతరుల వలన ఆకస్మిక ఇబ్బందులను కలుగజేయును. శనైశ్చరుడు ఏప్రిల్‌ 29 నుండి భాగ్యన్థానమందు కుంభరాశిలో తామ్రమూర్తిగా సంచరించును. ఈ సంవత్సరం ఈ రాశివార్కి నవమ, అష్టమ స్థానములలో శని సంచారము ఒకప్పుడు ధనలాభము ఒకప్పుడు దుఃఖము, వ్యాధిని సూచించును. భార్యా, సంతానం విషయంలో దుఃఖము, అపమృత్యు దోష పరిహారార్ధము రుద్రాభిషేకములు చేయుట మంచిది. న్యాయవాదులు, వైద్యులు స్వయం వృత్తుల వారి సమస్యలు అధికమగును. ఇంజనీరింగు సైన్సు టెక్నాలజీ విద్యార్ధులకు ప్రోత్సాహకరముగా యుండును. న్యాయసంబంధ విషయాల్లో రాజిపడటం మంచిది. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కిరావు లేక ఇబ్బందులు కలగవచ్చు, మీకు అనుకూలం లేకపోవచ్చు. నవమ స్థానంలో శని అదృష్టానికి అధిపతి కావడంతో, శని కుంభరాశి లోనికి మార్పు శుభ ఫలితాలనిస్తుంది. మీ ప్రవర్తన మూలంగా తల్లితండ్రులు మానసికంగా ఒత్తిడి గురవుతారు. సోదరమూలకంగా కలహము. ఆరోగ్య విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఇబ్బందులు తప్పవు. శ్రమను అధిగమించి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

Know More Gemini/Mithuna/మిథున రాశి

రాహు కేతువులు ఏప్రిల్‌ 12వ తేదీ నుండి వరుసగా ఏకాదశ, పంచమ స్థానములందు తామ్రమూర్తులుగా సంచరింతురు. రాహువు ఏకాదశ స్థానమందు ఆకస్మిక ధనలాభములను కలుగచేయును. గృహమున ఉత్సవ వాతావరణము నెలకొనును. గోలాభము కల్గుతుంది. పెంపుడు జంతువులపై శ్రద్ధ వహిస్తారు. మృష్టాన్న భోజనము, వస్త్ర పుష్పమాలికా మొదలగు శుభయోగములు, సమాజమున గౌరవము పెరుగును. ధైర్యయుక్తమైన బుద్ధితో స్వశక్తిపై ఆధారపడి అన్నింటా విజయం సాధిస్తారు. గోభూలాభ ప్రాప్తి దూర ప్రాంతములలో వ్యవసాయ భూమిని వృద్ధిచేస్తారు. వ్యవహార జయములను పొందుతారు. గత రెండు సంవత్సరములుగా నెలకొని యున్న అరోగ్య, ఆర్ధిక సమస్యలకు ఫలవంతమైన పరిష్కారం లభిస్తుంది.

మృగశిర నక్షత్రం వారికి చాలాకాలంగా అపరిష్కృత సమస్యలకు పరిష్కారం, ఆర్ధ్ర నక్షత్రం వారికి సంవత్సరం ఆఖరుకు అనుకున్న ఫలితాలు వస్తాయి, పునర్వసు నక్షత్రం వారు ఆరోగ్య సమస్యలనుండి గట్టెక్కుతారు.

మృగశిర-పగడం, ఆర్ధ్ర-గోమేధికం, పునర్వసు-పుష్యరాగం ధరించుటచే మేలు జరుగును.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య – ‘5’. 1,3,6,8  తేదీల సంఖ్యలు, అది, గురు, శుక్రవారములు కలిసిన యోగప్రదము.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్‌: మీలో కోపం, అహం పెరగటంతో మీ వ్యక్తిగత జీవితం ప్రభావిత మవుతుంది. వృత్తి నైపుణ్యం పెంచుకుని అనుకోని విధంగా ఉన్నతస్థానంలో నియమితులవుతారు. చిత్తశుద్ధితో చేసే ప్రతీ పనీ మీకు కలసివస్తుంది.

మే: మీ బంధుమిత్రుల అసహజ ప్రవర్తన మిమ్ములను క్షోభపడేట్టు చేస్తుంది. సంయమనము, సహనం పాటిస్తే అన్నింటినీ అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం మిమ్ములను వరిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

జూన్‌: ధనవ్యయముతో కూడుకుని యుండును. స్థానభ్రష్టము, శరీరమున నొప్పులు గాయములు పనులు ఆలస్యమగుట, త్రిప్పట గల ఉద్యోగములలో జేరుట శరీర సౌఖ్యము లేకుండుట జరుగును.

జులై: జన్మరాశిలో రవి సంచారము వలన తరచూ కోపోద్రిక్తతలకు గురి అవుతారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్హకాలిక సమస్యలు వేధిస్తాయి. అధికార విస్తరణ జరుగుతుంది. యత్నకార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యము కల్గును.

ఆగష్టు: మాటకు విలువ స్థిరాస్తులు కొనుగోలు చేయుట, చేయు ప్రయత్నములు నెరవేరుట. ఆకస్మిక ధనలాభములు మిమ్ములను వరించును. అనుకున్న లక్ష్యములు నెరవేరును. కుటుంబ వాతావరణము అనుకూలము.

సెప్టెంబర్‌: ఆదాయ వ్యయములు సమపాళ్లలోయుండును. శారీరక అశాంతి, ఉష్ణ సంబంధమగు, వైరల్‌ సంబంధ జ్వరములు దేహపీడ, అనారోగ్యములు క్లిష్ట సమస్యలు ఎదురైనను ధైర్యముగా వ్యవహరించి జయించుకుని రాగలరు.

అక్టోబర్‌: అధిక ధనవ్యయము, అనవసరపు ఖర్చులు, ప్రయాణములలో విఘ్నములు, వేళనతిక్రమించి సుఖభోజనము లేకుండుట, మాతృవర్గము వారికి సుఖ సంతోషాలు, చిత్తశుద్ధితో చేసిన పనులు అనుకూలమగును.

నవంబర్‌: నెల ప్రారంభములో ఆహారశుద్ధిగాని పదార్ధములు భుజించుట, అజీర్ణము , మోకాలి నొప్పులు కలుగుట, మనశ్శాంతి లోపించుట, దూరప్రాంతముల కేగుట, భాగస్వామ్య వ్యాపారస్తులలో విభేధములు కల్గును.

డిసెంబర్‌: ఆకస్మిక ధనలాభము మిమ్ములను వరిస్తుంది. నీచ కార్యాశక్తి, పరపీడ, ఇతరదేశ సంచారములకు అవకాశము కల్గుతుంది. ఉద్యోగులకు పై అధికారుల వత్తిడులు, మోకాలు, కీళ్ల నొప్పులు, ధనవృద్ధి.

జనవరి 2023: ఉద్యోగ వృత్తి వ్యాపారాలకు కలసివస్తుంది. భూములు కొనుగోలు అమ్మకందార్లకు భాగస్వామ్య, వ్యవసాయదారులకు అనుకూల సమయం వ్యాపారులకు ధనలాభం కల్గును. సంతానం విషయంలో అప్రమత్తత అవసరం.

ఫిబ్రవరి: ధనధాన్య వస్త్రాలాభములు, ధనవృద్ధి, శరీరమందు నిరోగత పుష్కలమైన ఆరోగ్యము, తన కులాచారములు జరుపుట, గురుభక్తి, యత్నకార్యసిద్ధి, పుణ్యక్షేత్రములను సందర్శించుట, ఆచారవ్యవహారములు పాటించుట, సౌఖ్యం.

మార్చి: భయాందోళనలు తగ్గుట, గృహ సౌఖ్యము, శరీర సుఖము, ప్రయాణములు కలసి వచ్చుట, అనవసర ఖర్చులను అదుపుచేసి ఆదాయ వ్యయాలలో సమతుల్యత పాటిస్తారు. శరీరమున పుష్కలమగు కాంతి, కార్యసిద్ధి.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….