Simha Rasi Phalalu 2022-2023

Simha Rasi Phalalu 2022-2023

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు

Leo/Simha/సంహరాశి

(మఖ : 1,2,3,4 పాదములు, పుబ్బ: 1,2,3,4 పాదములు, ఉత్తర : 1 పాదములు)
(ఆదాయం – 08 వ్యయం – 14 రాజపూజ్యం – 01 అవమానం – 05)

ఈ రాశివారికి గురుడు ఏప్రిల్‌ 13వ తేదీ నుండి అష్టమస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యమును కలుగజేయును. గురుడు అష్టమరాశి సంచారముచే చోరభయము, అగ్నిభయము, వాక్కు గాంభీరము తగ్గుట, శరీరసౌఖ్యము తగ్గుట, తల మెడ నరములు సంబంధ నొప్పులు, అస్థిమితము, చెవులకింపుగాని మాటలు వినవలసివచ్చుట మొదలగు ఫలితములుండును. రుద్రాభిషేకములు దైవ, పితృదేవతారాధనము చేయుట ఇతరులను గౌరవించి సమయానుకూల ధోరణి ప్రదర్శిస్తారు. వ్యవహారజయమును పొందుట జరిగి, ఆయుర్దాయము వృద్ధియగును.

అనవసర ప్రసంగములు కలసిరావు. సమయానుకూల ధోరణి కల్గి ముందుకు సాగెదరు. అష్టమన్థానమందు గురు సంచారము దోషప్రదమైననూ, మూర్తిమంతముచే గురుడు శుభఫలితములనిచ్చి ఆయుర్దాయమును పెంపొందింప జేసి, భాగ్యవృద్ధిని కలుగజేయును. తన పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తుల విలువ అనేక రెట్లు వృద్ధియగును. స్వప్రయోజకత్వముతో సాధించిన ఆస్తులు గణనీయంగా పెరుగుతాయి. విద్యావిషయంలో ప్రతిష్టంభనలు క్రమేపీ తొలగి, ముందంజ వేయుదురు. లక్ష్యానికి దగ్గరౌతారు.

Know More Leo/Simha/సంహరాశి

శనైశ్చరుడు ఏప్రిల్‌ 29 నుండి సప్తమ స్థానమందు కుంభరాశిలో లోహమూర్తిగా సంచరించును. పరిశీలించగా శని ఈ సంవత్సరము సానుకూల ఫలితములు కలుగజేయును. ధనధాన్యములు వృద్ధినొందుట, తనవలన బంధువులకు సంతోషము కల్గుట, ఎంతటి కష్టతరమైన కార్యమైననూ దృఢనిశ్చయం, ఆత్మనిబ్బరంతో సాధించగలరు. ఇతరులను ప్రోత్సాహంచేసి సంఘమందు మార్గదర్శకులుగా ఉంటారు. మే, జూన్‌ నెలలో సామాన్య ఫలితములుంటాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. గృహ నిర్మాణము లేదా గృహమున మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. సంతాన విషయమై శుభయోగముల కోసం ఎదురుచూస్తారు. నిదానంగా కలసివస్తాయి.

రాహుకేతువులు ఏప్రిల్‌ 12వ తేదీ నుండి వరుసగా నవమ, తృతీయ స్థానములందు సువర్ణమూర్తులుగా సంచరించుట పెద్దగా అనుకూలమైన విషయం కాదు. పశుసంపద నశిస్తుంది. ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. తీర్ధయాత్రలకు అనుకూల సమయం కాదు.

మఘ నక్షత్రము వారికి వ్యవహార జయము సర్వకార్యసిద్ధియున్నూ, పుబ్బవారికి కుటుంబ సౌఖ్యము, బంధుజన ఆదరణ, ఉత్తర 1 వారికి వ్యాపారవృద్ధి, ధాన్యవృద్ధి కార్యసిద్ది కల్గును.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య – ‘1’. 3, 4, 5, 9 సంఖ్యలు గల తేదీలు ఆది, మంగళ, బుధ వారములతో కలసిన మరింత శుభప్రదము.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్‌: గ్రహస్థితి అనుకూలముకాదు. దూరప్రాంతములకు వెళ్లవలసి వచ్చుట వలన అలసట, చెడుపనులు చేయుట వలన ఖేదము, ఇతరులతో కలహములు, మోకాళ్ళ నొప్పులు, అజీర్ణవ్యాధికి అవకాశము లేకపోలేదు.

మే: దేహము సొంపు చెడుట, దొంగలవలన, అగ్నివలన భయము, వృత్తివ్యాపారముల యందు సామాన్య లాభములు, ఆశించిన ఫలితములు లేకపోవుట, అష్టమ కుజదోష ప్రభావము నివారించుటకు సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకము చేయుట మంచిది.

జూన్‌: గ్రహస్థితి సామాన్యముగా ఉండి క్రమేపీ నెలాఖరుకు యోగించును. శరీరమందు ఆరోగ్యము సుఖము, పోయిన ద్రవ్యములు లభించుట, మంచి ఆహారము భుజించుట, సంఘమందు గౌరవము పెరుగును. ధనలాభములు కల్గును.

జూలై: సాంఘిక కార్యక్రమములలో పాల్గొని తగు సలహాలు, సూచనలు చేయుట గౌరవము పెరుగుట. సాంఘిక కార్యములకు స్వంత ధనము వెచ్చించుట, వ్యవహారజయము, గ్రహస్థితి అనుకూలముగా యుండి యోగించును.

ఆగస్టు: గ్రహస్థితి సామాన్యము, వాగ్గాటి పెరుగుట, విద్యార్థులకు ఉన్నత విద్యలకు అవకాశము, ఇతరదేశ ప్రయాణములు కలసివచ్చును. కుటుంబ విషయములు ప్రోత్సాహకరము కాదు. నీలాపనిందలు భరించవలసి వచ్చును.

సెప్టెంబర్‌: నేర్పరితనం, స్వయంకృషితో ముందంజ, గతము కంటే నయము, ఆర్థిక విషయములు అనుకూలము, బంధుమిత్ర సఖ్యత, నూతన వ్యూహములతో విజయము, సంపద సృష్టి ఆనందము, రాజకీయంగా ముందంజ.

అక్టోబర్‌: దేవతారాధనలలో పాల్గొనుట, మంత్రసిద్ధి, దైవకార్యాచరణ, అలంకార ప్రియత్వము, నూతనముగా వాహనములు కొనుగోలు చేయుదురు. వృత్తి వ్యాపారములు కలసి వచ్చును. వ్యవసాయదారులకు అనుకూలము.

నవంబర్‌: మనస్సున ఆనందము, సాధుసంతులతో జేరుట, ఆధ్యాత్మిక ఉన్నతి, ధార్మిక కార్యక్రమములలో పాల్గొనుట, చేతికందినది సాయం చేయుట, సాంఘికసేవలో తనవంతు పాత్ర పోషించుట, ఆర్ధిక విషయములు ప్రోత్సాహకారము.

డిసెంబర్‌: వాతావరణ కాలమానములు అనుకూలము లేకపోయిననూ అన్నింటినీ జయించి వ్యవసాయదారులకు గతము కంటే విశేష లాభములు, పంటలు కలసివచ్చును. మానసిక బలహీనతలు, తల మెడ నరముల నిస్సత్తువలుండును.

జనవరి 2023: విందు వినోదములలో ధనవ్యయము, వస్త్రధాన్య లాభములు, విద్యా వినోదములచే ఆనందం కల్గుట, క్రీడలలోనూ కలసి వచ్చుట, గుర్తింపు, స్వచ్చమైన మేధ కలిగి కార్యజయము తీర్థయాత్ర సందర్శనములు.

ఫిబ్రవరి: ఎల్లప్పుడు ఆరోగ్యము స్త్రీ ధనలాభములు, ఆయుర్దాయము పెంపొందుట, యోగాభ్యాసము మొదలగు విషయములలో శ్రద్ధ వహించి, చక్కటి క్రమశిక్షణ కనబరచి తేజోవంతముగా యుందురు. ధైర్యముగా ప్రణాళికతో వ్యవహరించి కార్యసిద్ధి పొందెదరు.

మార్చి: గ్రహస్థితి సామాన్యము, భార్యా పిల్లలతో విరోధములు, గృహమున ప్రోత్సాహకరమగు వాతావరణము లేకుండుట, అకస్మాత్తు కలహములు, బాహ్య ప్రపంచముతో సంబంధము లేకపోవుట శరీర ఆరోగ్యము బాగుంటుంది.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….