Share:

Apara Ekadashi Telugu

Apara Ekadashi Telugu

అపరా ఏకాదశి

ధర్మరాజు శ్రీ కృష్ణుడు అడిగిను: జనార్ధనా! వైశాఖ మాసములోని కృష్ణపక్ష ఏకాదశిని ఏమని పేరు? దాని గొప్పతనమును గూర్చి తెలియచేయుము.

శ్రీ కృష్ణుడు ఈ విధముగా పలికెను: రాజా! లోకహితము కోరి నీవు మంచి మాటను అడిగినావు, వైశాఖ మాసములోని కృష్ణ ఏకాదశికి అపరా అని పేరు. ఇది గొప్ప పుణ్యమును ప్రసాదించుటయే గాక అనేక పాపములను పోగొట్టును. బ్రహ్మ హత్య, వంశక్షయము, భ్రూణహత్య, పరనింద, పరస్త్రీలంపటము, దొంగ సాక్ష్యము, సరియైన జ్ఞానము లేకుండా నక్షత్రగణనము చేయుట, కూట నీతితో ఆయుర్వేదము అనుచూ మానవుల ప్రాణములతో ఆటలాడుట వంటి పాపములను చేయువారు నరకమునకు పోవుదురు. అటువంటి వారు అపరా ఏకాదశీ వ్రతము. వలన పాప రహితులగుదురు. ఏ క్షత్రియుడైనా క్షత్రియ ధర్మమును విడిచి యుద్ధము నుండి పారిపోయి వచ్చిన యెడల వారు నరకమును పొందుదురు. ఏ శిష్యులు విద్యపొందియు గురునింద చేయుదురో వారు భయంకరమైన నరకములో పడుదురు. అయినప్పటికీ అటువంటి వారు కూడా అపరా ఏకాదశి వ్రతము చేసి సద్గతిని పొందుదురు.

Know More Ekadashi Mahatmya Aur Vrat Vidhi

మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో ఉండును. ఆ సమయములో ప్రయాగలో స్నానము చేసినవారు కాశిలో శివరాత్రి వ్రతము చేసినవారు, గయలో పిండ ప్రధానము చేసిన వారు, బృహస్పతి సింహరాశిలో నుండగా గోదావరి స్నానము చేసిన వాడు, బదరీకాశ్రమ యాత్రలో భగవానుడైన కేదారనాధుని దర్శించి బదరీ తీర్థములో స్నానము చేసినవారు, సూర్యగ్రహణ సమయములో కురుక్షత్రములో గజదానము, అశ్వధానము, సువర్ణదానము చేసినవారు ఎటువంటి పుణ్య ఫలము లభించునో అట్టి ఫలము అపరా ఏకాదశి వ్రతము చేసినవారికి లభించును. అపరా ఏకాదశి ఉపవాసము చేసి భగవాన్ వామనుడ్ని పూజ చేసిన మానవుడు విష్ణులోకమునకు పోవుదురు. ఈ కథ చదివిననూ, వినిననూ సహస్ర గోధానము చేసిన ఫలము లభించును అని శ్రీ కృష్ణుడు ధర్మరాజునకు ప్రభోధించును.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….