Karkataka Rasi Phalalu 2022-2023

Karkataka Rasi Phalalu 2022-2023

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు

Cancer/Karkataka/కర్కాటకరాశి

(పునర్వసు : 4వ పాదము, వుష్యమి : 1,2,3,4 పాదములు, ఆశ్లేష : 1,2,3,4 పాదములు)
(ఆదాయం -05 వ్యయం – 05 రాజపూజ్యం -05 అవమానం – 02)

శనైశ్చరుడు ఏప్రిల్‌ 29 నుండి అష్టమ స్థానమందు కుంభరాశిలో రజితమూర్తిగా సంచరించును. ఈ రాశివారికి 7, 8 స్థానములలో శని సంచారము అనుకూలము గాదు. వైవాహిక జీవనంలో సమస్యలు లేక వృత్తిలో మార్పులను సూచిస్తుంది. గృహ వాతావరణం అనుకూలం కాదు. మీరు పనిచేసే చోట వత్తిడికి గురికాకుండా ఆరోగ్యమును కాపాడుకోవడం మంచిది. ఊపిరితిత్తులు, గుండె ప్రభావితం కాకుండా జాగ్రత్త పడాలి. ఆర్ధిక మరియు వృత్తిపరమైన అంశాలలో కష్టనష్టాలను చవిచూడవలసి వస్తుంది. కోర్టు విషయాలు అనుకూలం కాదు. ప్రయాణాలలో వస్తువులు, డబ్బు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా జాగ్రత్త పడుట అవసరము. జ్ఞాతులతో విభేదం వలన అనర్ధం, నష్టం కలగవచ్చు. వృత్తిపరమైన అంశాలలో నష్టాన్ని నివారించేందుకు మనోనిబ్బరముతో కులదైవాన్ని పూజిస్తూ సత్సంప్రదాయానికి కట్టుబడి ఉండడం మంచిది.

రాహు కేతువులు ఏప్రిల్‌ 12వ తేదీ నుండి వరుసగా దశమ, చతుర్ధన్థానములందు రజితమూర్తులుగా సంచరింతురు. ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతా యోగించును. అధికార వృద్ధి కార్యదీక్ష గతంలో కంటే ఉత్తమ ఫలితములను కలుగజేయును. అప్పుడప్పుడు బంధువులతో చికాకులు మాట పట్టింపులు, అప్రియత్వము, పిత్రార్జిత వ్యయము అయిననూ బాకీలు తీర్చి మనోస్థిమితముగా యుండు కాలము. బుణ బాధలు తొలగుతాయి.

Know More Cancer/Karkataka/కర్కాటకరాశి 

వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట అనుకూలమగును. శరీర ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. మధుమేహము రక్తపోటు సమస్యలు మిమ్ములను బాధిస్తాయి. గుహ్యావయవముల యందు శస్త్రచికిత్సలకు వైద్య సలహాలు పొందుతారు. ద్రవ్యలాభము తన కులాచారము ప్రకారము ప్రవర్తించుట, తమ కుటుంబములో పెద్దవారిని గౌరవించి వారి నిర్ణయానుసారము కార్యలాభములు, వ్యవహారజయములు పొందుదురు. నూతన గృహములు ఖరీదు చేయుట లేక గృహ నిర్మాణములు కలసివచ్చును. ఇతరులకు తమ వంతుగా అన్ని విషయములలోనూ సహాయము చేసే స్వభావము బంధుమిత్ర సమాగమము, గృహమున కళ్యాణాది శుభములు కలసివచ్చును.

కుటుంబ సభ్యులను ప్రోత్సహించిన, వారి సలహా సంప్రదింపులతో కార్య జయము కల్గుతుంది. వ్యాపారస్తులకు విశేష లాభాలు లేకపోయినా, ప్రతికూల సమయం మాత్రం కాదు. కళాకారులకు, చేతి వృత్తుల వారికి పెద్దగా ఆశించిన ఫలితము కనపడదు. సినీ రాజకీయ రంగము వారికిన్నీ అంతంత మాత్రముగానే యుంటుంది.

పునర్వసు వారికి సౌభాగ్యవృద్ధి, పుష్యమి వారికి కార్యభారం, ఆశ్రేష వారికి కుటుంబ వృద్ధికల్గుతుంది.

పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగం, పుష్యమి వారు నీలం, ఆశ్రేష వారు పచ్చ ధరించవచ్చును.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య – ‘2’. 4,6,8,9 సంఖ్యలు గల తేదీలు ఆది, సోమ, శుక్ర, శనివారములు కలసిన మరింత యోగదాయకము.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్‌: ఈ నెలలో ధనవ్యయాలగురించి అసలు ఆలోచించవలసిన పనిలేదు. ఆదాయమునకు తగిన ఖర్చు ఉంటుంది. సాంఘికగౌరవము పెరుగుతుంది. ఇతరులపై క్రోధము మానుట మంచిది. విపత్తులనుంచి బయటపడతారు

మే: శ్రమ అధికమగుట, త్రిప్పట, అలంకార వస్తుప్రాప్తి. ఉద్యోగప్రాప్తి, పైఅధికారులను దర్శించుట, వారికి హితకరమగు మాటలు చెప్పుట, మాట సహాయము, ధనము నిల్వ చేయుట, గృహమున ఆనందకరమగు వాతావరణము.

జూన్‌: సమసై్శ్వర్యములు వృద్ధి అవుతాయి. వ్యవసాయదారులకు పంటలు పుష్కలముగా పండి ధనము చేకూరుతుంది. గతములో చేసిన బాకీలు తీరుతాయి. వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

జూలై: అధికారవృద్ధి, ఉద్యోగంలో ఉన్నతి, వృత్తి వ్యాపారాలు అనుకూలం, ఆరోగ్యం ఐశ్వర్యం హుందాతనం, ఇతరులను మాటలతో చల్లబరచే వాక్చాతుర్యం కల్గి ఉంటారు. అందరిలోనూ మెరుపులా మెరుస్తారు. శిరోవేధన తరచు వేధిస్తుంది.

ఆగష్టు: అనారోగ్య సూచన, నాభి ప్రాంతములోను ఉదరసంబంధమైన ఇబ్బందులు, భార్య విషయంలోనూ వైద్యుని సలహాలు సంప్రదింపులు, పరీక్షాకాలం, తొట్రుపాటు లేకుండా నిదానం అవసరం. ధనాదాయానికి లోటు లేదు.

సెప్టెంబర్‌: మనస్తాపము, చికాకులుగా ఉన్ననూ క్రమైపి సమన్యలకు సరైన పరిష్కారం కనుగొనడం వలన ప్రతికూలతను అధిగమిస్తారు. వృద్ధి, స్థిరాస్తులను మార్చుట వలన లాభపడతారు. వ్యాపార లావాదేవీలు అనుకూలము.

అక్టోబర్‌: ఎన్ని సమస్యలున్నా వాటికి పరిష్కారం లభిస్తుంది మంచి గురుబలం పుష్కలంగా ఉంది. ధైర్యంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మాసంలో మీ ఇంట విశేష శుభయోగం కల్గుతుంది.

నవంబర్‌: ప్రియసంభాషణము, ధనకనక, వస్తు, వస్త్ర, లాభములు కల్లును. ప్రతీ విషయాన్ని అనేక కోణాల్లో ఆలోచించడం, విషయ విశ్లేషణ చేయడం, సమయపాలన, ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం కనుగొని దూసుకుపోతారు.

డిసెంబర్‌: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. పూర్వపు ఆస్తులు కలసివస్తాయి. భూమి కొనుగోలు లేదా భూమి మూలకంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులు దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలం.

జనవరి 2023: ప్రయాణాలు మిశ్రమ ఫలితాన్నిస్తాయి. విద్యార్థులు ప్రతిభా పాటవాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు. విద్యా విషయమై విశేష కృషిచేస్తారు. క్రీడల్లోనూ, ఉన్నత విద్యా పరిశోధనల్లో నాణ్యమైన ప్రదర్శన చూపుతారు.

ఫిబ్రవరి: బంధుమిత్రుల సందడి, గృహమున కళ్యాణాది శుభయోగములు శుభవ్యయము, మీరు చేసే ప్రతిపనిని పైఅధికారుల నుండి బంధు మిత్రుల ప్రోత్సాహం ఉంటుంది సరైన సమయం సరైన నిర్ణయం మీకు కలసివస్తుంది.

మార్చి: ఆదాయమార్గాలు ఆదాయ వనరులు పుష్కలంగా పెరుగుతాయి. పొగిడే వారే మిత్రులనే ఆపోహ సరైనదికాదు. విద్యార్థులకు అనుకూల సమయం దూరప్రయాణాలు కలసివస్తాయి. విద్యాఉద్యోగ విజయాలు వరిస్తాయి.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….