24 Shiva Abhishekam
1. పుష్పోదకము చేత అభిషేకించిన భూ’లాభము కలుగును.
2. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
3. మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
4. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
5. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
6. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
7. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
8. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు.
9. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
Know More Shiva Panchakshara Stotram
10. భాస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
11. మామిడి పండ్ల రసము చేత అభిషేకము ధీర్ఘ వ్యాధులు నశించును.
12. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
13. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
14. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
Know More Shiva Dwadasa Nama Stotram
15. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.
16. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
17. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
Know More Shiva Tandava Stotram
21. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
22. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
23. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
24. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
…. ….