Share:

Don't Eat Rice on Vaikunta Ekadashi

Don’t Eat Rice on Vaikunta Ekadashi

వైకుంఠ ఏకాదశి/Vaikunta Ekadashi

రోజున బియ్యం తినకూడదా!!

ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి కానీ సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశి రోజునే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు.ఈ పవిత్రమైన రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవ ఆలయాలలో ఉన్న ఉత్తర ద్వారం ద్వారా భక్తులు సూర్యోదయానికి పూర్వమే భగవంతుడి దర్శనం చేసుకుంటారు. 

వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అని తెలుపుతున్నారు పండితులు. 

Know More Ekadashi Mahatmya Aur Vrat Vidhi

ఈ ఒక్క ఏకాదశి రోజునే మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందు వల్ల ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున సముద్రమథన సమయంలో హాలాహలం, అమృతం ఉద్భవించాయని, హాలాహలాన్ని పరమశివుడు మింగి గరళకంఠుడు అయ్యాడు. ఈ రోజునే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగే మార్గళి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. 

వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు కాబట్టి ఆ రోజున బియ్యంతో చేసిన ఎటువంటి పదార్ధం తినకూడదు అని అంటారు. 

ముఖ్యంగా ఈ రోజున ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం నిర్వహించి భగవద్గీతను దానం చేస్తారు. ఏకాదశి రోజున తులసీతీర్థం తప్ప ఇంకా ఏమీ తినకూడదు, అతిథి లేకుండా ద్వాదశి రోజున భోజనం చేయకూడదు. ఏకాదశి రోజున ఉపవాసం చేసి, ద్వాదశి రోజున అన్నదానం చేస్తారు.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….