Share:

Maa Chhinnamasta Mahavidya

ఛిన్నమస్తా మహవిద్య (Maa Chhinnamasta Mahavidya)

Chinnamastha Jayanti is celebrated on the Vaishaka Masam Shukla Paksha Chaturdasi day (14th) before pournima day of lunar calendar.

Maa Chhinnamasta Mahavidya స్వయం శిరః ఖండిత దేవత. హిందూమతంలోని తాంత్రిక దేవతలలో చిన్నమస్తా, ఛిన్నమస్తిక వజ్ర వైరోచినీ మరియు ప్రచండ చండికగా పిలువబడే ఛిన్నమస్త ఒక ముఖ్యమైన దేవత. అమ్మవారి జన్మదినాన్ని “ఛిన్నమస్త జయంతి” గా జరుపుకుంటారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. తాంత్రిక బౌద్ధ మతంలో ఈమెను ఛిన్నముండ అని పిలుస్తారు. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. ఛిన్నమస్తా దేవిని శక్తి యొక్క రౌద్ర రూపంగా కొలుస్తారు. ఛిన్నమస్త అనగా “ఖండింపబడిన శిరస్సు” అని అర్ధం.

ఈ హిందూ ఆధ్యాత్మిక అమ్మవారు భీతికరమైన ప్రతిరూపంతో చిత్రీకరింపబడినది. శాక్తేయ సంప్రదాయంలో ఛిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

Know more Dasa Mahavidya Kavacham

హిందూమతంలో ఉన్న దేవతలలోకెల్ల అత్యంత ఉగ్రరూపంతో ఉండే దేవతలలో ఛిన్నమస్త ఒకరు. స్వీయ-శిరచ్ఛేదం చేరుకున్న ఈమె ఒక శక్తిపీఠ దేవత. ఛిన్నమస్త ప్రాణదాత మరియు ప్రాణహర్త. మహావిద్యాలలో ఒక దేవతగా కొలువబడే ఈమెను లైంగిక వాంఛపై స్వీయ నియంత్రణకు చిహ్నంగా లైంగిక శక్తిస్వరూపిణిగా భావిస్తారు.

పురాణాల ప్రకారం ఆమె తన మాతృభావనలతో చేసిన త్యాగానికి,తన లైంగిక ఆధిపత్య ధోరణికి మరియు స్వీయ వినాశకారక రౌద్రానికి ప్రతీక.ఆమె తీరు రౌద్రం మరియు భీభత్సంతో కూడుకుని వుంటుంది. కనుక ఆమెను అన్ని చోట్ల పూజించరు. ఆమెకు సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా ఉత్తర భారతం మరియు నేపాల్ లో ఉంటాయి. ఆమెను హిందువులు మరియు బౌద్ధ మతం వారు పూజిస్తారు. బౌద్ధ మతంలో ఈమెను ఛిన్నముండ అని పిలిచే దేవత ఛిన్నమస్తను పోలి ఉంటుంది. ఛిన్నముండ, వజ్రయోగిని పేరుతో టిబెట్ కు చెందిన బౌద్ధమతం వారు కొలిచే ఖండిత శిరస్సు కలిగిన దేవత.

Know More Durga Dwadasa Nama Stotram

ఛిన్నమస్త నగ్నరూపంలో చుట్టూ పరుచుకున్న కురులతో నలుపు మరియు రుధిర వర్ణ దేహం కలిగి ఉంటుంది. ఆమె పదహారేళ్ళ ప్రాయంలో నిండైన వక్షం కలిగిన బాలికగా, హృదయం వద్ద నీలి కలువ కలిగి ఉంటుంది. ఛిన్నమస్త ఒక నగ్న జంట పై నిలబడి ఉంటుంది. ఆ జంటను శృంగార దేవదంపతులైన రతిమన్మధులుగా చెప్తారు. ఛిన్నమస్త జంధ్యంగా సర్పాన్ని ధరించి, మెడలో మహాకాళి వలే కపాలాలు, ఎముకలతో కూడిన దండను ధరించి ఉంటుంది. ఆమె ఖండిత కంఠం నుండి చిమ్ముతున్న రక్తధారలను, ఆమె సేవకురాళ్ళయిన జయ మరియు విజయ నోట్లోకి ప్రవహిస్తుంటాయి.

ఆమె ఎడమచేతిలో ఆమె కపాలంతోనే చేసిన భిక్ష పాత్ర, కుడిచేతిలో ఆమె తన శిరస్సు ఖండించడానికి ఉపయోగించిన ఖడ్గం ఉంటాయి.

Know More Dasa Mahavidya Sthuthi

ఛిన్నమస్తా దేవి జన్మకు సంబంధించిన అనేక వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి. నారద-పంచరాత్ర పురాణములలో ఈ క్రింది కధ తెలుపబడింది. ఒకసారి మందాకిని నదిలో స్నానమాచరిస్తుండగా పార్వతి దేవికి లైంగిక ఉత్తేజం కలిగి నల్లగా మారింది. ఇంతలో ఆమె సేవకురాళ్ళయిన ఢాకిని మరియు వర్ణిని (జయ మరియు విజయ)లకు ఆకలికలిగి దేవతను తమ ఆకలి తీర్చిమని అడిగారు. జగన్మాత పార్వతి చుట్టుపక్కల ఎంత వెతికినా తినడానికి ఏమి దొరకలేదు. అప్పుడు ఆమె తన శిరస్సును ఖండించుకొనగా మూడు దిశలలో చిమ్మిన మూడు రక్తధారలలో ఒకటి జయ నోట్లోనికి, రెండవది విజయ నోట్లోనికి మరియు మూడవది ఖండింపబడిన పార్వతి శిరస్సు నోట్లోనికి ప్రవహించాయి.

ఇంకొక కధ ప్రకారం ఛిన్నమస్త రతిమన్మధుల నగ్న జంట పై నిలబడి ఉంటుంది. అలా నిలబడిన ఆమె తన భౌతిక శరీరంపై పూర్తి నియంత్రణతో తన శరీరం నుండి మనస్సును విముక్తం చేసుకోవడం కొరకు శిరస్సు ఖండించుకుంటుంది.

Know More Durga Kavacham

ఛిన్నమస్తను జీవితచక్రం లోని మూడు దశలైన జన్మ, రతి మరియు మృత్యువు అనే దశలకు చిహ్నాలుగా మూడు రూపాంతరాలలో సేవిస్తారు. ఛిన్నమస్త ఇంట్లో కొలుచుకునే ప్రత్యేక దేవతగా ఆంత ప్రసిద్ధి చెందలేదు. తాంత్రికులు అతీంద్రియ శక్తులు మరియు సిద్ధి ప్రాప్తి కొరకై ఈమెను ఉపాసిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి “శ్రీం హ్రీం క్లిం ఐం వజ్రవైరోచనియే హం హం ఫట్ స్వాహా ” అనే మంత్రం పాటించాలి.

చిత్రమస్తా గాయిత్రి:

!! ఓం వైరోచన్యైచ విద్మహే చిత్రమస్తాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ !!

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….