Share:

Dry Ginger / శొంఠి

Dry Ginger / శొంఠి

వాత జలుబు : శొంఠిని నీటిలో వేసి బాగా మరిగించి కషాయం అయిన తరువాత గోరువెచ్చగా ఉన్నప్పుడు 30 మి.లీ. వరకు తాగాలి. ఇలా రోజుకు మూడుసార్లు సేవించినచో చాలాకాలం నుండి వుండే జలుబు నయమవుతుంది.

శొంఠి చూర్ణం 10గ్రా. బెల్లం 10గ్రా. మరియు నెయ్యి ఒక చెంచాడు. కలిపి అందులో కొద్దిగా నీటిని కలిపి పొయ్యిమీద పెట్టాలి. అది పాకంలా అయ్యే అంతవరకు ఉంచాలి. ప్రతిరోజు ఉదయం ఈ ఔషధాన్ని చప్పరించినచో మూడు రోజులలోనే జలుబు తగ్గిపోవును.

జ్వరం : శొంఠిని పెరుగుతేటలో అరగదీసి ప్రతిరోజూ 21 రోజుల వరకు త్రాగినచో పాతజ్వరంలో నుండి బయటపడతారు. 2 గ్రా. శొంఠిని మేకపాలలో అరగదీసి రోజులో మూడుసార్లు త్రాగించినచో గర్భవతికి వచ్చిన మలేరియా తగ్గుతుంది.

ధాతుస్రావం : శొంఠి, పసుపు మరియు బెల్లం సమానంగా కలిపి కషాయం తయారు చేసుకొని ప్రొద్దున పూట పరగడుపున ఒకమాసం వరకు నియమంగా త్రాగినచో ధాతుస్రావం తగ్గుతుంది. మూత్రం గుండా అవుతున్న ధాతుస్రావం కూడా తగ్గుతుంది.

నడుమునొప్పి : శొంఠి మరియు పల్లేరు సమభాగాలలో తీసుకొని ఉదయం, సాయంత్రం కషాయం చేసి త్రాగినచో కూడా నడుం నొప్పి తగ్గును.

Know More : 9 Types of Fever Remedies

తలనొప్పి : శొంఠిని నీటిలో గాని లేక పాలతోగాని అరగదీసి దాని నస్యం చేసిన లేక నుదుటిపై లేపనం చేసినచో తలనొప్పి మరియు మైగ్రేన్ తలనొప్పి దూరమవుతుంది.

అల్లానికి, శొంఠికి ప్రముఖమయిన తేడా వేడి చేయడంలోనే వుంది. శొంఠి రుచికరమైంది. అజీర్తి దోషాలని పోగొడుతుంది. ఆహారాన్ని వంటబట్టేలా చేస్తుంది. కఫాన్ని కడిగిపారేస్తుంది. గొంతుని శుద్ధి చేస్తుంది. వాంతుల్ని తగ్గిస్తుంది.

అజీర్ణం – పుల్లటి త్రేనుపులు : 500మి.లీ. మరుగుతున్న నీటిలో 25 గ్రా. శొంఠి చూర్ణాన్ని వేసి దానిని 20 -25 నిముషాల వరకు మూసి మరగనీయాలి. మరల దానిని దింపి చల్లగా అయిన తరువాత బట్టలో వడబోసి ఇందులోంచి రోజు 25 నుండి 40 మి.లీ. కషాయం రోజులో మూడుసార్లు సేవించినచో అరగకపోవడం, పుల్లటి త్రేనుపులు, కడుపునొప్పి మొదలగు వికారాలు దూరమవుతాయి.

సౌభాగ్య శొంఠి : 250గ్రా. శొంఠి, 400 గ్రాముల నెయ్యి, 2 లీటర్లు ఆవుపాలు మరియు 1 కిలో చక్కెర అన్నింటినీ ఒకేసారి కలిపి పాకం చేయాలి. మరల అందులో శొంఠి, నల్లమిరియాలు, దాల్చినచెక్క, నేలక్కాయలు, తమలపాకు ప్రత్యేకంగా 20-20 గ్రాములు తీసుకొని చూర్ణం చేసి కలపాలి. ఈపాకం సీసం లేక పింగాణిపాత్ర (పచ్చడిపాత్ర) లేక మట్టి పాత్రలో పెట్టాలి. ఈ పాకాన్ని సౌభాగ్య శొంఠిపాకం లేక శొంఠి రసాయనం అని అంటారు. 10 నుండి 20 గ్రాములు ఈ పాకాన్ని నియమంగా సేవించాలి. దీనిని సేవించడం వల్ల శరీర కాంతి, ధాతుబలం మరియు ఆయువు పెరుగును. ఈ పాకం స్త్రీలకు అతి ఉత్తమమైనది.

శొంఠిని అరగదీసిన గంధాన్ని రెండు కళ్ళలో కొంచెం పెట్టుకుంటే జలుబు తగ్గుతుంది. కళ్ళలోని మలిన పదార్థాలు బయటికి వచ్చేసి కళ్ళు శుభ్రపడతాయి. కడుపులోని నులిపురుగులు నివారణకి శొంఠి పొడిని రోజూ ఆహార పదార్ధాలలో వాడాలి.

శొంఠిని నీటిలో అరగదీసి, కణతలకు, నుదురుకు పట్టువేస్తే, భరించలేని తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. రోజూ అన్నంలో శొంఠి పొడిని ఒక ముద్దలో కలుపుకొని తింటుంటే జీర్ణశక్తి బాగా అభివృద్ధి చెందుతుంది.

అమీబియాసిస్ : అమీబియాసిస్ అనే జిగురు విరేచనాలు తరచుగా అవుతుంటే శొంఠిని క్రమం తప్పకుండా వాడుకుంటే అది మ్యూకస్ పొరను రక్షించి పేగులు శిధిలం కాకుండా కాపాడుతుంది.

కరక్కాయ, వాము, శొంఠి ఈ మూడింటిని కలిపి బెల్లంతో నూరి తింటే కీళ్ళవాతం తగ్గుతుంది. విరేచనం సాఫీగా అవుతుంది.

ఆముదం పప్పు, శొంఠి, పంచదార ఈ మూడింటినీ సమానంగా కలిపి ఎంత మోతాదు తీసుకుంటే సాఫీగా విరేచనం అవుతుందో అంత తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

శొంఠిని మెత్తగా నూరి, కాచిన పాలు కాసిని కలిపి రెండు, మూడు చుక్కలు ముక్కుల్లో వేస్తే తలనొప్పి తగ్గుతుంది.

బాగా బెరడుకట్టిన శొంఠి ఒక తులం, నెయ్యి రెండున్నర తులాలు, (ఆవు)పాలు చిన్నగ్లాసుడు, పంచదార ఆరు తులాలు కలిపి మరిగిస్తూ అవి మరుగుతున్నప్పుడు అందులో మళ్ళీ శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, వీటిని ఒక్కొక్క గ్రాము పొడి చొప్పున తీసుకుని కలిపి పాకం పట్టినట్లయితే సౌభాగ్య శొంఠి తయారవుతుంది.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….