Share:

Cardamom / యాలకులు

Cardamom / యాలకులు

దగ్గు : చిన్న యాలకులను పెనం మీద కాల్చి బొగ్గులా చేసి దానిని చూర్ణం. చేసి ఒక గ్రామ మాత్రలో తేనెలో కలిపి రోజులో మూడుసార్లు సేవించినచో పొడి దగ్గు తగ్గుతుంది.

యాలకులు సన్నని చూర్ణాన్ని అరగ్రాము శొంఠి చూర్ణం, అరగ్రాము కలిపి తేనెతో చప్పరించినచో లేక యాలకుల నూనెను 4-5 చుక్కలతో చక్కెర కలిపి తీసుకున్నచో కఫయుక్తంగా వచ్చే దగ్గు తగ్గుతుంది.

వాంతులు : యాలకుల లోపల గింజలు ఒకటి నుండి రెండు గ్రాములు చూర్ణం లేక యాలకుల నూనె ఐదు చుక్కలు, దానిమ్మ పానీయంతో కలిపి త్రాగినచో వాంతులు తగ్గుతాయి.

జ్వరం : యాలకుల గింజలను, మారేడు గుజ్జు, గలిజేరు, పాలు మరియు నీరు అన్నింటినీ ఒకేసారి కలిపి మరిగించాలి. ఎప్పుడైతే కేవలం పాలు మిగిలిపోతాయో అప్పుడు దింపివేసి నీటితో (గోరువెచ్చని) సేవించినచో అన్ని రకాలైన జ్వరాలు దూరమవుతాయి. ఈ ప్రయోగాన్ని రోజులో మూడుసార్లు సేవించాలి.

మూత్రంలో మంట : యాలకులు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమభాగంలో కలిపి పొద్దున్న, సాయంత్రం సేవించినచో మూత్రంలో మంట దూరమవుతుంది. ఈఉపయోగంలో శరీరంలోని చేతులు, కాళ్లు మంటలు కూడా తగ్గుతాయి. చూర్ణం యొక్క మాత్ర మాత్రం 2 నుండి 3 గ్రాములు తీసుకోవలసి ఉంటుంది.

నొప్పి : యాలకుల పలుకులు, వేయించిన ఇంగువ, యవక్షారం చిటికెడు మరియు సైంధవ లవణం కషాయం చేసి అందులో కొద్ది మొత్తం ఆముదం నూనె కలిపి సేవించినచో నడుము, హృదయం, నాభి, వీపు, తల, చెవులు, కళ్ళు మొదలగు నొప్పులు దూరమవుతాయి.

నేత్ర జ్యోతి : యాలకుల పలుకుల చూర్ణం మరియు చక్కెర సమభాగాల్లో కలిపి అందులో కొద్దిగా ఆముదం నూనె కలిపి ఐదు గ్రాముల మాత్రలో ప్రతిరోజు ప్రొద్దున సేవించినచో కంట్లో చలువ చేస్తుంది. మరియు కంటి జ్యోతి కూడా పెరుగుతుంది.

Know More : Heart Attack Ayurvedic Remedies

నోటి దుర్గంధం : పాలు లేక ఏదైనా తినే పదార్థాలతో యాలకులు సేవించినచో నోటి దుర్గంధంతో విముక్తి కలుగుతుంది.

జీర్ణక్రియ : అన్నం తిన్న తర్వాత యాలకులు నమిలినచో తిన్న అన్నం త్వరగా జీర్ణమవుతుంది.

పురుషత్వం : దానిమ్మ గింజల రసంలో మూడు గ్రాముల యాలకులు చూర్ణాన్ని కలిపి సేవించినచో పురుషత్వంలో వృద్ధి అవుతుంది.

ఫిట్స్: యాలకులు ఐదు గ్రాములు, పటిక బెల్లం 10 గ్రాములు కలిపి నూరి త్రాగిస్తే మూర్ఛ వ్యాధులకి మంచిది. రోజూ తాగితే ఫిట్స్ రావడం తగ్గుతాయి.

నోటి దుర్వాసన వున్నప్పుడు తరచు ఏలకులు వాడటం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. పయోరియా అనే నోట్లో చిగుళ్ళ నుంచి రక్తంకారే వ్యాధి కూడా తగ్గిపోతుంది.

తరచుగా అంటే రోజుకొక యాలక్కాయ తినేవారికి ఉబ్బసం తగ్గిపోతుంది. యాలకులు గుండెకు మంచి టానిక్కు లాంటిది. వీటిని తరచుగా తింటుంటే గుండెకు మంచి బలాన్నిస్తుంది.

యాలక్కాయలు పూటకు ఒకటి తింటుంటే పొట్టలోని మలినాలు పోతాయి. యాలకులు అజీర్ణమును నిరోధిస్తాయి. కడుపులో వాయువులు ఉన్నప్పుడు కూడా యాలకులు వాడితే తగ్గిపోతుంది.

 

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….