Table of Contents
Chinta / చింత
1 Tamarindus Indica
తామరవ్యాధి : చింతగింజలను నిమ్మరసంతో అరగదీసి ఆ గంధాన్ని తామరపై రాయాలి.
లివర్ వ్యాధులు రాకుండా : చింతపూలపొడిని కరివేపాకు పొడిలో కలుపుకొని తింటూంటే లివర్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
తేలు కుడితే : చింతగింజను నీటిలో అరగదీసి ఆ గంధాన్ని తేలుకుట్టినచోట పట్టిస్తే ఆరేటప్పటికి విషం దిగుతుంది.
పచ్చకామెర్లు (జాండీస్) : చింతాకు – వేపచిగుళ్ళు వేరువేరుగా దంచి, రెండు భాగాలు చింతకు ముద్దతో 1 భాగం వేప చిగుళ్ళ ముద్దను చేర్చి మెత్తగా నూరాలి. యీ మిశ్రమ ఔషధం ఉదయం పరగడుపున కరక్కాయ పరిమాణం ముద్దను మ్రింగించి, పాలు త్రాగించాలి. యీ విధంగా చికిత్సను వారానికి 1-2 సార్లు యిస్తూ చప్పిడి పద్యం చేయిస్తే ఎంత కఠినమైన పచ్చకామెర్లు వ్యాధి అయినా 2-4 వారాలలోనిస్సందేహంగా తగ్గిపోతుంది.
Know More : 9 Health Benefits of Ashwagandha
కుసుమవ్యాధులు : చింతగింజల మృధు చూర్ణం మోతాదుకు 2 గ్రా చొప్పున నిత్యం 2 పూటలా బియ్యం కడుగు నీళ్ళతో యిస్తే కుసుమ వ్యాధులు చిత్రంగా తగ్గుతాయి. (Leucorrhea)
ఋతుశూల : కుంకుడుకాయంత చింతపండు గుజ్జులో కంగుల్ల సున్నంపొదిగి స్త్రీ బహిష్టు రోజులలో 1-2 రోజులు ఉదయం మాత్రమే ఇస్తూ చప్పిడి చేయిస్తే ఋతుశూల తప్పక తగ్గిపోతుంది. (Dysmenorrhoea) (1-2 బహిష్టు నెలల్లో యిస్తేచాలు)
వ్రణలు పుండ్లు : చింత ఆకులను మెత్తగా పొడి చేసి దీర్ఘకాలపు వ్రణాలు పుండ్లపై రాస్తే త్వరితగతిన మానిపోతాయి.
ఉలిపిర్లు : చింతాకుల రసంలో కొద్దిగా సైంధవలవణం కలిపి పేస్టులా చేసి ఉలిపిర్లుపై పట్టిస్తే అవి రాలిపోతాయి.
కామెర్లు, ఉబ్బుకామెర్లు : చింతాకురసం రెండు చెంచాలు, ఒక గ్లాసు మజ్జిగతో కలిపి ఉదయం, సాయంత్రంపూట తాగితే కామెర్లు, ఉబ్బుకామెర్లు వ్యాధి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
….
….






