Share:

 

Maa Tripura bhairavi Mahavidya

త్రిపురభైరవి మహావిద్య (Maa Tripura bhairavi Mahavidya)

Tripura Bhairavi Jayanti is celebrated on the Powrnima day Magha Masama.

త్రిపుర భైరవి/Maa Tripura bhairavi Mahavidya అమ్మవారు నవగ్రహ నాయకిగా పిలుస్తారు. ఈ అమ్మవారిని ఎవరైనా జన్మ నక్షత్రం, పుట్టిన తేది మరియు రోజు తెలియని వారు పూజించవచ్చు. “అమ్మవారి ఆవిర్భావం మాఘ మాస పౌర్ణమి” నాడు జరిగుంది. వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది. అమ్మవారి స్వరూపం చూస్తే కట్టిన ఎర్రని వస్త్రము, విమర్శశక్తి కి ప్రతీక. గళంలోని ముండమాల వర్ణమాలకు రక్త పయోధరాలుర రజోగుణ సంపన్న సృష్టికి, అక్షపమాల – వర్ణ సమామ్మాయానికి; పుస్తకం – బ్రహ్మవిద్యకు; త్రినేత్రాలు వేదత్రయకి, మందహాసం కరుణకు ప్రతీకలు. ఈ అమ్మవారిని పూజించటం వలన అపమృత్యు దోషాలు, విషజంతువుల భయాలు, అంటువ్యాధులు నివారణకు ఈమె ను ఆరాధించాలి.

Know more Dasa Mahavidya Kavacham

నశించే జగత్తును అధిస్టాత దక్షిణామూర్తి కాలభైరవుడు. అతని శక్తియే త్రిపుర భైరవి బ్రహ్మాండపురాణంలో గుప్తయోగినుల అధిష్టాత్రి గా పిలుస్తారు. ఇలా మత్స్య పురాణంలో త్రిపుర భైరవి, కోలేశ భైరవి, రుద్రభైరవి, చైతన్య భైరవి మొదలైన వర్ణన ఉంది. అమ్మవారి ప్రస్తావన, దుర్గసప్తసతి మూడో అధ్యాయం మహిషాసుర వధ సందర్భంలో వస్తుంది రుద్రయామళంలో, భైరవీకుల సర్వస్వంలోఉపాసన, కవచం చెప్పబడ్డాయి త్రిపుర భైరవి అమ్మవారు.

నుండి అః వరకు ఉన్న 16 అక్షరాలు భైరవునికి చెందగా క నుండి క్ష వరకూ భైరవినకి చెందినవి. స్వచ్ఛందోప్రధమ పటాలంలో యోగీశ్వరీ రూపంలో ఉన్న ఉమయే అమ్మవారు. శంకరుని పతిగా పొందాలనే తపనతో ఉంటుందని చూపబడింది.

త్రిపురభైరవి సుత్తిలో, భైరవి సూక్ష్మ వాక్కుకు, జగత్తుకు మూలకారణమైన దానికి అధిష్టాత్రిగా చెప్పబడుతున్నది ఇందులో అనేక బేధాలు ఉన్నాయి. సిద్ధ భైరవి, భువనేశ్వరి భైరవి, కామేశ్వరీ భైరవి , కామేశ్వరీభైరవి, కోలేశీ భైరవి రుద్రభైరవి అనేక భేధాలున్నాయి.

సిద్ధ భైరవి ఉత్తరా దిక్కు పీఠానికిదేవత .నిత్య భైరవి పశ్చిమ దిక్కు పీఠానికి దేవత.ఇందులోని ఉపాసకుడు సాక్షాత్తూ శివుడు. రుద్ర భైరవి దక్షిణ దిక్కు పీఠానికి దేవత. ఇందులో ఉపాసకుడు మహావిష్ణువు. ముండమలా తంత్రాన్ని బట్టి త్రిపుర భైరవి కి నరసింహస్వామికి అభిన్న శక్తిని ప్రసాదించిది. సృష్టిలోని ఆకర్షణ వికర్షణ శక్తులదే మూలం.

Know More Dasa Mahavidya Sthuthi

క్షణక్షణం పరివర్తన శీలమైన జగత్తుకు అధిస్టాత్రి కావడంతో త్రిపుర భైరవి అని పిలుస్తారు. అమ్మవారి సంబంధించిన రాత్రి కాలరాత్రి అని; భైరవుడు,కాలభైరవ పిలుస్తారు.

ఇంద్రియాల పట్ల విజయాన్నిసాధించాలన్నా అమ్మవారి ని ఉపాసించాలి.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….