Table of Contents
15 List of Tithi Benefits for shraddhakarma
మహాలయపక్ష తిథులలో శ్రాద్ధకర్మలు చేస్తే వాటి ఉపయోగాలు
వర్షఋతువులో భాద్రపద కృష్ణత్రయోదశి మాఘా నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసినా అది పిర్త్రుదేవతలకు అక్షయ త్రిప్తుని ఇస్తుందని విశ్వాసం. భాద్రపదమాసంలో క్రిష్ణపక్షాన్ని మహాలయ పక్షం అని అంటారు. మహాలయం అంటే గొప్ప విశేషం లేక మరణము. భాద్రపద మాసంలోని రెండవ పక్షాన్నే పితృపక్షం అని అంటారు. అంటే పితృ దేవతలకు విశేషంగా ప్రీతికరమైన మాసం అని భావం.
భాద్రపద పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పరిశీలిస్తే ఖగోళంలో సూర్యుడు కొద్ది రోజులు సింహ రాశిలోను, కొద్ది రోజులు కన్యారాశిలోను ఉంటుంటాడు.భాద్రపదమాసంలోణి శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతా పూజలకు అంతే శ్రేష్టమైనది అని శాస్త్ర వచనం.పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కాబట్టే దీనికి పితృపక్షం అని మహాలయ పక్షం అని పేరు.
ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. అలా కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. పితృ దోషం అంటే ఒక శాపం. గతజన్మలో ఎవరైనా వృద్ధులకుగాని, తల్లిదండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణం అవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తరువాతి తరం వారు కష్టాలపాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది.
జాతకచక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారు ఈ పక్షంలో వచ్చే నవమిరోజున తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీదండ్రులు లేనివారు ఈ పక్షాన తప్పకుండా పితృకర్మలు చేయాలి. ఈ పక్షం అంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య రోజు చేసి తీరాలి.
Know More 27 Yoga or Nitya Yoga
ప్రతి మాసంలో వచ్చే అమావాస్య అయినా, మాహాలయ అమావాస్య అయినా పిత్రు దేవతలకు ఎంతో ప్రీతికరమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాలను చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు మహాలయ కాలం. ఇందులో త్రయోదశి తిథి మరీ ముఖ్యమైనది. ఈ మహాలయ పక్షంలో రోజూ లేదా ఆయా తిథులలో Shraddhakarma/శ్రాద్ధకర్మలు చేస్తే పితరులు సంవత్సరం వరకు సంతృప్తి చెందుతారని స్కాంద పురాణంలో చెప్పబడింది.
తిథుల ప్రకారం పొందే ఉపయోగాలు ఏమిటో క్రింద వివరించడమైనది.
తిథి ఉపయోగాలు
పాడ్యమి : ధన సంపద
విదియ : రాజయోగం, సంపద
తదియ : శతృవినాశనం
చతుర్థి : ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి
పంచమి : ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి
షష్టి : శ్రేష్ఠ గౌరవం
సప్తమి : యజ్ఞం చేసిన పుణ్యఫలం
అష్టమి : సంపూర్ణ సమృద్ధి, బుద్ధి ప్రాప్తి
నవమి : అంతులేని సంపద
దశమి : ధాన్య , పశు సంపద వృద్ధి
ఏకాదశి : సర్వశ్రేష్ఠదాన ఫలం
ద్వాదశి : సమాజ అభివృద్ధి, ఆహార భద్రత
త్రయోదశి : ఐశ్వర్యం, దీర్ఘాయువు, సంపూర్ణ ఆరోగ్యం
చతుర్థశి : శతృభయం నుండి విముక్తి
అమావాస్య : అన్ని కోరికలు నెరవేరుతాయి
…. ….