Share:

Elinati Shani Remedies

Elinati Shani Remedies

ఇలా చేస్తే ఏలిననాటి శని పోతుందా

ఏలిననాటి శని పోవాలంటే కొన్ని పాఠితిస్తే సరి. అవి ఏమిటంటే …

ప్రతిరోజూ అన్నం తినేముందు కొంత భాగం అన్నం కాకులకు వేయండి. రొట్టిముక్కలకు నువ్వులనూనె రాసి, వీథి కుక్కలకు రాత్రిపూట వాటిక ఆహారంగా వేస్తే శనిగ్రహ దోషాలకు నివారణ జరుగుతుంది. ఇనుము, పెనం, నూనె దానం చేయండి.

ఏ లగ్నంవారికైనా కానీ శనిగ్రహస్థితి బాగోకపోతే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం, రాత్రిపూట కాలభైరవ స్తోత్రం పఠించండి. నల్ల గుర్రం యొక్క కాలికి కట్టిన నాడాని తీసుకువచ్చి, నువ్వులనూనెతో నాడాని అభిషేకించి శనిస్తోత్ర పఠించండి. గుమ్మానికి కానీ తలుపుకు కానీ కట్టడం వల్ల శనిగ్రహ ప్రభావం నుండి తప్పిస్తుంది.

నల్లనువ్వులు 8 సంఖా కొలత గల ఇనుము లేదా స్త్రీలు అరిటాకులో పోసి దక్షిణ తాంబూలం పెట్టి శనిగ్రహాన్ని విధివిధానంగా పూజించి, మధ్యాహ్నం ఒంటిగంట – ఒంటిగంట మూడు నిముషాల మధ్యవయస్సు బ్రాహ్మణుని ఆహ్వానించి పాద ప్రక్షాళన చేసి నమస్కరించి, పశ్చిమ దిక్కుకు తిరిగి దానం ఇవ్వాలి.  నువ్వుల ఉండలు పిల్లలకు పంచడం, ఆవాలు, గడ్డ పెరుగు కలిపి గేదెకు పెట్టడం శనిగ్రహ దోష నివారణలో ఒక విధానం.

Know More Sunday Saptami

శనిగ్రహానికి అధిష్టాన దైవం శ్రీ వేంకటేశ్వరుడు. శనివార నియమం పాటిస్తూ ప్రతి రోజూ వెంకటేశ్వరసామికి పూజ అభిషేకం చేయడం వల్ల శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఇనుము లేదా స్టీల్ బిందెలో శుద్ధ జలాన్ని నింపి, అందులో నల్లనువ్వులు, మినుములు, నల్ల ఉమ్మెత్త వేర్లు, దర్భలు, జమ్మి ఆకులు వేసి ఉంచుకోవాలి. ధన ఆకారపు ముగ్గు వేసి దానిపై దర్భలు పరిచి బిందెను ఉంచాలి.

ఓం ఐం హ్రీం శ్రీ శనైశ్చరాయ నమః

ఓం బ్రాం బ్రీం బ్రౌం సః శనయే నమః

ఈ శనిగ్రహ మంత్రాన్ని పఠించి, బిందెలోని నీళ్ళతో  శిరఃస్నానం చేయాలి. ప్రతి శనివారం ఈ విధంగా చేస్తే శనిగ్రహ దోష నివారణ జరగడంతో బాటు శని బాధా నివారణకు దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయాలలో ప్రదక్షిణాలు హనుమాన్ చాలీసా పఠనం, విఘ్నేశ్వరుని శరణు కోరినా శని బాధ పటాపంచలు కావడం తథ్యం. 

ప్రతి శనివారం గరికెతో గణపతిని పూజించడం మంచిది అలాగే ప్రతి శనివారం సాయం సంధ్య వేళలో రాగి ప్రమిదలో ఆవునెయ్యి, ఆముదం, నువ్వుల నూనెలు కలిపినా మిశ్రమంతో భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి నమస్కరిస్తే శనిగ్రహ దోష నివారణ తప్పక జరుగుతుంది

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….