Share:

ఆపిల్ జ్యూస్/Apple Juice

Apple Juice/ఆపిల్ జ్యూస్ వలన ఆరోగ్యనికి కలిగే ప్రయోజనాలు

ఆపిల్ జ్యూస్/Apple Juice : ఆపిల్ పండ్లు ఆరోగ్యకరమని అందరికి తెలిసిందే, కానీ ఆపిల్ పళ్ళ కన్నా, ఆపిల్ రసం ఆరోగ్యానికి మంచి చేకూర్చటమే కాకుండా వివిధ రకాల వ్యాధులను కూడా తగ్గిస్తుంది, నమ్మకం కలగటం లేదా! అయితే ఇది చదవదండి.

 

ఆపిల్ జ్యూస్/Apple Juice

ఆపిల్ జ్యూస్ రుచికరంగానే కాకుండా, ఇది సహజ సిధమైన రస ద్రవ్యం, శరీరానికి కావలసిన విటమిన్స్, పోషకాలను సమకూరుస్తుంది. రోజు ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్ జ్యూస్ వల్ల కలిగే కొన్ని ఉపయోగాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

 

మతిమరుపు వ్యాది 

ఆమ్స్ స్ట్రాంగ్ తెలిపిన దాని ప్రకారం, రోజు ఆపిల్ జ్యూస్ సేకరణ వలన మతిమరపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. రోజులో 2 గ్లాసుల ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల శరీరంలో బీటా- అమైలిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ ప్రోటీన్ మెదడులో కొన్ని రకాలైన రంధ్రాలను ఏర్పరచటం వలన మతిమరపు వ్యాధి వస్తుంది. 

 

బరువు తగ్గటం 

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా…ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల మీ బరువును సులువుగా తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్’లో 100 క్యాలోరీలు మరియు 15 గ్రాముల కార్బోహైడ్రేట్’లని కలిగి ఉంటాయి. ఇది కొవ్వుని ఎక్కువ కలిగి ఉండకపోవటం వలన శరీరంలో కొవ్వు పదార్థాలను నియంత్రిస్తుంది.

 

క్యాన్సర్  

ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ వల్ల, కోలన్, చర్మ, బ్రెస్ట్ కాన్సర్’ను కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది. ఆపిల్ జ్యూస్ ఎక్కవగా ఉపయోగకరమైన కారకాలను కలిగి ఉండటం వల్ల, ఆనారోగ్య పరిస్థితులలో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

డిమెంటియా

రోజు ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల వయసు మీరిన వాళ్ళలో వచ్చే డిమెంటియాని తగ్గిస్తుంది. ఈ వ్యాధిని తగ్గించటమే కాకుండా, మెదడును చురుగ్గా ఉంచేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన ద్రావాన్ని తాగి మెదడును చురుగ్గా ఉంచుకోండి.

 

శక్తిని ఇస్తుంది

శరీరానికి కావలసిన విటమిన్ ‘A’, ‘C’,’E’,’K’ మరియు ‘ఫోలేట్’ వంటి శక్తిని విడుదల చేసే కారకాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆపిల్ పండులోని అన్ని భాగాలు ఉపయోగపడేవే, దాని పైన ఉన్న తోలు కూడా. అందువలన ఇది సరైన శక్తిని ఇచ్చే ద్రవం.

 

గుండెకి అపాయం

ఆపిల్ జ్యూస్ పైటో-నుట్రీఎంట్స్ వంటి చురుకైన కారకాలను కలిగి ఉండటం వలన గుండెపోటు వంటి ప్రాణాంతకర వ్యాధులను కలిగించే వాటి నుండి కాపాడుతుంది. రోజుకి ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరలలో కొవ్వు ఏర్పడటాన్ని నిషేదించి, గుండెకి వచ్చే గుండెపోటును రాకుండా చేస్తుంది.

 

జీర్ణక్రియని పెంచుతుంది

ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్, మూత్రపిండాలు, కాలేయానికి హాని కలుగ చేసే విష పదార్థాలను తొలగించి శుభ్రపరుస్తుంది. ఇది జీర్ణక్రియ వ్యవస్థను శుభ్రపరచి, జీర్ణక్రియ రేటుని పెంచి, కాలేయానికి, ముత్రపిండాలకు హాని కలుగ చేసే వాటిని తొలగిస్తుంది.

 

కంటి చూపును వృద్దిచేస్తుంది

ఆపిల్ జ్యూస్ కంటిచూపును అభివృద్ది చేస్తుంది. ఆపిల్ జ్యూస్ విటమిన్ ‘A’ని కలిగి ఉండటం వలన కంటికి వచ్చే వ్యాధులను దూరంగా ఉంచి కంటి చూపును వృద్ధి చేస్తుంది.

 

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….