Table of Contents
7 Remedies for Acidity
ఎసిడిటీ సమస్యను సులభంగా తగ్గించే కొన్ని సహజ ఔషదాలు
ప్రతిఒక్కరు ఇదొక సమయంలో ఎసిడిటీ కలిగి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎసిడిటీ అనేది సాధరరణంగా కలిగే, చికాకులను కలిగించే మరియు ఆహారాన్ని సరిగా తినకుండా చేసే రుగ్మత. నిజానికి జీర్ణాశయంలో అధిక మొత్తంలో ఆమ్లాలు విడుదల లేదా ఉత్పత్తి అవటం వలన ఇది కలుగుతుంది. అంతేకాకుండా, దీనిని తగ్గించుటకు చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. ఎసిడిటీ సమస్యను సులభంగా తగ్గించే కొన్ని సహజ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది. ఎసిడిటీ కలుగచేసే అసౌకర్యాల వలన రోజు నిర్వహించే విధులను కూడా నిర్వహించలేము. ఇక్కడ తెలిపిన సహజ ఔషదాలు, అల్లోపతి మందుల కన్నా ఎసిడిటీని సమర్థవంతంగా తగ్గిస్తాయి.
1.అల్లం(Ginger)
శాంతనపరిచే గుణాలను కలిగి ఉండే అల్లం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి మరియు ఎసిడిటీని శక్తివంతంగా తగ్గిస్తుంది. ఎసిడిటీని త్వరగా ఉపశమనం పొందుటకు గానూ, ఉదయాన అల్లం ముక్కను నమలండి లేదా రోజు ఒక కప్పు అల్లంతో చేసిన టీని తాగండి.
2.ఉసిరి(Amla)
రోజు ఉసిరిని తీసుకోవటం వలన చాలా రకాల ప్రయోజనాలను పొందుతారు. ఉదర భాగంలో కలిగే మంట, నొప్పి, పెప్టిక్ అల్సర్ మరియు పైల్స్ వంటి సమస్యలను శక్తివంతంగా తగ్గిస్తుంది. రోజు స్వచ్ఛమైన నెయ్యిలో ఉసిరిని కలుపుకొని తినటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
3.కలబంద(aloe veera)
అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలను కలిగి ఉండే కలబంద, ఎసిడిటీ నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది. సగం కప్పు కలబంద రసాన్ని తాగటం వలన దీని నుండి ఉపశమనం పొందుతారు. వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే ఈ ఔషదాన్ని మన ఆహారంలో కలుపుకొని కూడా తినవచ్చు.
4.తులసి(Basil)
సాధారణంగా ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి తులసి తెలిసే ఉంటుంది. ఇది ఎసిడిటీని తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. వైద్యపరమైన గుణాలను కలిగి ఉండే తులసి, ఆయుర్వేద వైద్యంలో కూడా వాడుతున్నారు. నిపుణుల ప్రకారం, భోజనానికి ముందు కొన్ని తులసి ఆకులను నమలటం వలన జీర్ణాశయ సమస్యలు కలగవని తెలుపుతున్నారు.
5.జీలకర్ర(Cuminseeds)
ఒక గ్లాసులో తాజా నారింజ రసాన్ని తీసుకొని, దీనికి వేయించిన జీలకర్రను కలపండి. ఎసిడిటీ సమస్య ప్రారంభమైయ్యే మొదట్లోనే దీనిని తాగటం వలన త్వరిత ఉపశమనాన్ని పొందుతారు. మంచి ఫలితాలను పొందుటకు, దీర్ఘకాలిక సమయంతో పాటూ లేదా ఒక వారం పాటూ తాగండి.
6.లవంగాలు(Cloves)
లవంగాలను నమిలినపుడు వెలువడే గాఢమైన రుచి, అదనపు లాలాజల స్రావానికి కారణమవుతుంది. ఫలితంగా, జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. కార్మేటివ్ గుణాలను కలిగి ఉండే లవంగాలు, జీర్ణాశయంలో ఆహారం కిందకు జరిగేలా ప్రోత్సహిస్తుంది.
7.పుదీనా(Mint)
సహజంగా ఎసిడిటీని తగ్గించే సహజ ఔషదంగా పుదీనా ఆకులను తెలుపవచ్చు. రోజు ఉదయాన పడిగడుపున లేదా ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలండి. ఇలా ఒక నెల లేదా పూర్తిగా ఎసిడిటీ సమస్య తగ్గే వరకు అనుసరించండి. అంతేకాకుండా, భోజనం తరువాత పుదీనా ఆకులతో చేసిన రసాన్ని కూడా తాగవచ్చు. భోజనం తరువాత తీసుకోవటం వలన జీర్ణక్రియ సరిగా అయేలా చూస్తుంది.
…. ….