Share:

Sri Lalita Siva Jyoti Aarti

Sri Lalita Siva Jyoti Aarti

శ్రీ లలితా శివ జ్యోతి హారతి

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

జగముల చిరు నగముల పరిపాలించే జననీ,
అనయము మము కనికరమున కాపాడే జననీ,
మనసే నీ వసమై, స్మరణే జీవనమై,
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి. ||1||

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

అందరికన్నా చక్కని తల్లికి — సూర్యహారతి,
అందలేలే చల్లని తల్లికి — చంద్రహారతి,
రవ్వల తళుకుల కలలా జ్యోతుల — కర్పూరహారతి,
సకల నిగమ వినుత చరణ — శాశ్వత మంగళ హారతి. ||2||

Know More : Ardha Naareeswara Ashtakam

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….