108 names of manideepeswari
Manideepeswari Ashtottara Shatanamavali
మహాసంపదలిచ్చు మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళి
శ్రీ లలితాదేవి విగ్రహం ముందుగాని, ఫోటోముందుగాని కూర్చోని ఈ అష్టోత్తర | శతనామావళిని 108 రోజులు సమయం తప్పకుండ ప్రతిరోజు ఉదయం 6 గం||లకు సా॥ 6 గం॥లకు గాని చేసి గంధాక్షిత, చందన తాంబూలాలతో అమ్మను పవిత్రంగ సేవించి పసుపు కుంకుమతో పూజిస్తే, సకల భువన విజయం లభిస్తుంది.
Know More Rajarajeshwari Ashtakam
ఇట్టి సాధకుల మాటను ప్రతివారు గౌరవిస్తారు. జన్మ జన్మలకు దారిద్ర్యం అనేది దరిదాపునకు కూడారాదు. దుఃఖం అనేది ఎట్లుంటుందో గూడా తెలియని స్థితిలో ఉంటారు. పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో తులతూగుతారు.
108 names of manideepeswari
1.ఓం దివ్యలోకవాసిన్యై నమః
2.ఓం సర్వలోక సంరక్షణాయై నమః
3.ఓం సర్వమృత్యు సర్వాపద్వి నివారిణ్యై నమః
4.ఓం లలితా బాలా, దుర్గా శ్యామలాకృతియై నమః
5.ఓం గంగా, భవాని గాయత్రీ స్వరూపాయై నమః
6.ఓం లక్ష్మీ, పార్వతీ, సర్వస్వతీ స్వరూప విభవాయై నమః
7.ఓం రాజ రాజేశ్వరీ దేవ్యై నమః
8.ఓం భక్తాభీష్టదాయిన్యై నమః
9.ఓం భక్తి భుక్తి ముక్తి ప్రదాయిన్యై నమః
10.ఓం భక్త సంకల్ప సిద్ధిదాయై నమః
11.ఓం పృథ్వీశ్వరీ దైవ్యై నమః
12.ఓం ఆధివ్యాధి నివారిణ్యై నమః
13.ఓం దౌర్భాగ్యనాశిన్యై నమః
14.ఓం సౌభాగ్యదాయిన్యై నమః
15.ఓం సృష్టి స్థితిలయాయై నమః
16.ఓం అష్టసిద్ధి నవనిధి ప్రదాయిన్యై నమః
17.ఓం అష్టదిక్పాలక వందితాయై నమః
18.ఓం త్రికాల వేదిన్యై నమః
19.ఓం షడ్గుణ సం సేవితాయై నమః
20.ఓం షడ్రుతు పరివేష్టితాయై నమః
21.ఓం నవగ్రహ విధివిధానాధిష్టానాయై నమః
22.ఓం సత్యధర్మశాంతి ప్రేమ ప్రసాదిన్యై నమః
23.ఓం సర్వకాల సర్వావస్థ సమస్థితాయై నమః
24.ఓం అనంత సాగర, నదీ నదాకృతియై నమః
25.ఓం కాంస్య (కంచు) లోహమయ ప్రాకారిణ్యై నమః
26.ఓం పీత (ఇత్తడి) లోహమయ ప్రాకారిణ్యై నమః
27.ఓం తామ్ర (రాగి) లోహమయ ప్రాకారిణ్యై నమః
28.ఓం సీసలోహమయ ప్రాకారిణ్యై నమః
29.ఓం పంచలోహమయ ప్రాకారిణ్యై నమః
30.ఓం రజితాసాల ప్రాకారిణ్యై నమః
31.ఓం సువర్ణసాల ప్రాకారిణ్యై నమః
32.ఓం పుష్యరాగమణి మయ ప్రాకారిణ్యై నమః
33.ఓం పద్మరాగమయ ప్రాకారిణ్యై నమః
34.ఓం గోమేధికమణిమయ ప్రాకారిణ్యై నమః
35.ఓం వజ్ర నిర్మితమయ ప్రాకారిణ్యై నమః
36.ఓం వైఢూర్య నిర్మితమయ ప్రాకారిణ్యై నమః
37.ఓం ఇంద్రనీలమణిమయి ప్రాకారిణ్యై నమః
38.ఓం మరకతసాలమయ ప్రాకారిణ్యై నమః
39.ఓం ప్రవాళసాలమయ ప్రాకారిణ్యై నమః
40.ఓం రత్నసాలమయ ప్రాకారిణ్యై నమః
41.ఓం చింతామణిమయ ప్రాకారిణ్యై నమః
42.ఓం శృంగారమండప దేవదేవతాయై నమః
43.ఓం జ్ఞానమండప జ్ఞానేశ్వరీ దేవ్యై నమః
44.ఓం ఏంకాంతమండప ధ్యానేశ్వరీ దేవ్యై నమః
Know More Sri Rajarajeshwari Dwadasa Nama Stotram
45.ఓం ముక్తిమండప ముక్తేశ్వరీ దేవ్యై నమః
46.ఓం కాశ్మీరవన కామాక్షీ దేవ్యై నమః
47.ఓం మల్లికావన మహారాజ్యై నమః
48.ఓం కుందవన కౌమారీ దేవ్యై నమః
49.ఓం కస్తూరివన కామేశ్వరీ దేవ్యై నమః
50.ఓం సాలోక్యముక్తి ప్రసాదిన్యై నమః
51.ఓం సారూప్యముక్తి ప్రదాయిన్యై నమః
52.ఓం సామీప్యముక్తి దాయిన్యై నమః
53.ఓం సాయుజ్యముక్తి సుప్రసాదిన్యై నమః
54.ఓం ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి రూపిణ్యై నమః
55.ఓం పరాంకుశ పాశాభయ హస్తాయై నమః
56.ఓం సహస్రకోటి సహస్ర వదనాయై నమః
57.ఓం మకరంద ఘృతాంబుధియై నమః
58.ఓం సహస్ర కోటి సహస్ర చంద్ర సమసుధా నేత్రాయై నమః
59.ఓం సహస్రకోటి సహస్ర సూర్య సమాభాసాయై నమః
60.ఓం జరామరణ రహితాయై నమః
61.ఓం నారద తుంబుర సకలమునిగణ వందితాయై నమః
62.ఓం పంచభూత యజమాన్య స్వరూపిణ్యై నమః
63.ఓం జన్మ జన్మాంతర దుఃఖ భంజనాయై నమః
64.ఓం లోకరక్షాకృత్య తత్పరాయై నమః
65.ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర కోటి వందితాయై నమః
66.ఓం చతుషష్టి కళా సంపూర్ణ స్వరూపిణ్యై నమః
67.ఓం షోడశకళా శక్తి సేనా సమన్వితాయై నమః
68.ఓం సప్తకోటి ఘనమంత్ర విద్యాలయాయై నమః
69.ఓం మదన విఘ్నేశ్వర కుమార మాతృకాయై నమః
70.ఓం కుంకుమ శోభితదివ్య వదనాయై నమః
71.ఓం అనంత నక్షత్ర గణనాయకాయై నమః
72.ఓం చతుర్ధశ భువన కల్పితాయై నమః
73.ఓం సురాధినాధ సత్సంగ సమాచా కార్యకలాపాయై నమః
74.ఓం అనంగ రూప పరిచారక సేవితాయై నమః
75.ఓం గంధర్వయక్ష కిన్నెర కింపురుష వందితాయై నమః
76.ఓం సంతాన కల్పవృక్ష సముదాయ భాసిన్యై నమః
77.ఓం అనంతకోటి బ్రహ్మాండ సైనికాధ్యక్ష సేవితాయై నమః
78.ఓం పారిజాత, కదంబ వన విహారిణ్యై నమః
79.ఓం సమస్త దైవీకటుంబ వందితాయై నమః
80.ఓం చతుర్వేద కళా చాతుర్యై నమః
81.ఓం బ్రాహ్మీ మహేశ్వరీ వైష్ణవీ వారాహీ వందితాయై నమః
82.ఓం చాముండి మహాలక్ష్మీ ఇంద్రాణి పరిపూజితాయై సమః
83.ఓం షట్కోణ యంత్ర ప్రకాశిన్యై నమః
84.ఓం సహస్ర స్తంభ మండప విహారిణ్యై నమః
85.ఓం సమస్త పతిప్రతా సంసేవితాయై నమః
86.ఓం నాద బిందు కళాతీత శ్రీచక్ర వాసిన్యై నమః
87.ఓం పాపతాప దారిద్ర నాశిన్యై నమః
88.ఓం శృతి, స్మృతి, పురాణ కావ్య సంరక్షణాయై నమః
89.ఓం పంచబ్రహ్మాసన విరాజితాయై నమః
90.ఓం వజ్రవైఢూర్యమరకత మాణిక్య చంద్రకాంత, రత్న సింహాసన శోభితాయై నమః
91.ఓం దివ్యాంబర ప్రభాదివ్య తేజో విభాసాయై నమః
92.ఓం పంచముఖ సర్వేశ్వర హృదయాధిష్టా నాయై నమః
93.ఓం ఆపాద మస్తక నవరత్న సువర్ణాభరణ ధారిణ్యై నమః
94.ఓం విలాసిని అఘోర మంగళాశాసన పీఠశక్తి వందితాయై నమః
95.ఓం క్షమ, దయ, జయ, విజయ పీఠశక్తి పరిపాలితాయై నమః
96.ఓం అజిత, అపరాజిత, నిత్య, పీఠశక్తి పరిపూజితాయై నమః
97.ఓం సిద్ధి, బుద్ధి మేధ, లక్ష్మీ, శృతి, పీఠశక్తి సేవితాయై నమః
98.ఓం ల తుష్టి పుష్టి పీఠశక్తి ప్రభాసితాయై నమః
99.ఓం నవరాత్రి దీక్షా ప్రియాయై నమః
100.ఓం నామ, గాన, జ్ఞాన యజ్ఞ ప్రియాయై నమః
101.ఓం జప తపయోగ త్యాగ సంతుష్టాయై నమః
102.ఓం పంచదశీ మహావిద్యాయై నమః
103.ఓం సదాషోడశప్రాయ సర్వేశ్వర వల్లభాయై నమః
104.ఓం ఓం కారాక్షర స్వరూపిణ్యై నమః
105.ఓం సకలయంత్ర సకలతంత్ర సమార్చితాయై నమః
106.ఓం సహస్ర యోజన ప్రమాణ, చింతామణిగృష వాసిన్యై నమః
107.ఓం మహాదేవ సహిత శ్రీ పరమేశ్వరీ దేవ్యై నమః
108.ఓం మణిద్వీప విరాజిత మహాభువనేశ్వరీ దేవ్యై నమః
ఇతి మణిద్వీపేశ్వరి భువనేశ్వరీ దేవి అష్టోత్తర శతనామావళి సమాప్తః
ఓం శాంతి శాంతి శాంతిః
…. ….