Onion / ఉల్లిపాయ

Onion / ఉల్లిపాయ

ఉల్లిపాయలు తరిగేతప్పుడు కళ్ళ వెంట నీరు రావడం సహజం. ఇలా కంటి వెంట వచ్చే నీటి వలన కళ్ళు శుభ్రపడతాయంటారు.

గోంగూర పచ్చటి వంటి వానిలో పచ్చడి చేసే కీడుకు ఉల్లిపాయ దివ్యమైన ఔషధం. దీనిలో పచ్చి ఉల్లిపాయనే కొరుక్కుని తింటారు. పచ్చడి వేడిచేస్తే ఇది చలువచేస్తుంది.

కడుపులో బల్ల అంటారు. కాలేయం పెరగడం వల్ల ఇలా కడుపులో బల్ల వలె కనబడుతుంది. శరీరం సన్నబడి, కడుపు మాత్రం బాగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితి పోవాలంటే నీరుల్లిపాయల్ని ఉడకబెట్టి ప్రతిపూట నాలుగేసి తింటుంటే సరిపోతుంది.

నీరుల్లిపాయల్ని పొయ్యిలో వేసి కాల్చి, మెత్తగా నూరి నొప్పి, వాపు ఉన్న ప్రాంతాలలో ఆ పదార్ధంలో మందంగా పట్టువేస్తే కీళ్ళనొప్పులు వాపులు తగ్గిపోతాయి. ఉదయం, సాయంత్రం రెండుపూటలా ఈ విధంగా చేయాలి.

శరీరంలో తిమ్మెరలు అధికంగా వున్నప్పుడు రోజుకు మూడుసార్లు పచ్చి నీరుల్లిపాయను బాగా నూరి ఆ గుజ్జు మర్ధన చేస్తుంటే రక్తప్రసరణ సరిగ్గా జరిగి తిమ్మెరలు తగ్గిపోతాయి.

తేలు కుట్టినప్పుడు ఉల్లిపాయ గుజ్జును రుద్దితే ఉపశమనం వుంటుంది. నిద్ర సరిగ్గా రాకపోతే రాత్రుళ్ళు రెండు నీరుల్లిపాయల్ని ముక్కలు చేసుకుని తింటున్నా ప్రశాంతంగా మంచి నిద్రపడుతుంది.

పూటకు ఒక పచ్చి నీరుల్లిపాయ తింటుంటే బొట్లు బొట్లుగా మూత్రం పడుట తగ్గుతుంది. ముక్కలుగా కోసి ఆహారంలో తీసుకోవచ్చు. మూర్ఛరోగం పోతుంది.

ఆవనూనె, ఉల్లిపాయలు కలిపి నూరి పట్టువేస్తే కీళ్ళవాతపు నొప్పులు తగ్గుతాయి.

ఉల్లిపాయల రసంలో పంచదార కలిపి తాగితే బలకరం. మూలరోగాలు తగ్గుతాయి. చలవనిస్తుంది. ఈ రసంలోనే మిరియాల పొడి కూడా కలుపుకొని తాగితే జ్వరాలుమూత్రరోగాలు తగ్గుతాయి. కలరాకి కూడా ఇది హితకరం.

Know  More : Spine Remedies

ఉల్లిగడ్డల్ని ఉడికించి కడితే, చీముగడ్డలు త్వరగా పక్వానికొచ్చి పగులుతాయి.

ఉల్లిపాయల రసంలో కొద్దిగా నెయ్యి, ఆ నేతిలో సగం తేనె కలిపి రెండుపూటలా తీసుకుని పాలు తాగితే, మగతనం ద్విగుణీకృతం అవుతుంది. సుఖ వ్యాధులకు మంచిది. మధుమేహ రోగులకు చాలా అవసరం.

మూత్రపిండాలలో రాళ్ళున్న వ్యక్తులకి ఉల్లిరసాన్నిస్తే రాళ్ళు కరగడం, నొప్పి బాధలు ఉపశమించడం, మూత్రంలో మంట తగ్గడం జరుగుతుంది.

చంటి పిల్లలకు దగ్గరగా ఉల్లిపాయ ముక్కలు ఉంచితే వడదెబ్బ కొట్టదు.

పిల్లలకు వేసవి కాలంలో రోజూ ఉల్లిపాయల్ని వుడికించి పెడితేమంచిది.

See also  Poppy Seeds / గసగసాలు

కొద్దిగా మెంతులు, ఉల్లిపాయ ముక్కలు ఈ రెంటికీ సమానంగా వెన్నపూస కలిపితింటే నీళ్ళ విరేచనాలు, జిగురు విరేచనాలు తగ్గుతాయి.

 

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….