Share:

Curry Leaves / కరివేపాకు

Curry Leaves / కరివేపాకు

కరివేపాకులో ఐరన్ వుంటుంది. ఇది బలవర్ధకము. ముఖ్యంగా అనేమియా (రక్తహీనత) గల రోగులు కరివేపాకు అధికంగా తీసుకుంటూ వుంటే అనేమియా నుండి బయటపడవచ్చు.

శరీరం ఎప్పుడూ తడిసి ముద్ద అయ్యేంతగా చెమటలు పట్టేవారు వళ్ళంతా ఎల్లప్పుడూ చల్లగా ఉండేవారు కరివేపాకు ఆహారంలో తీసుకుంటే వేడి కలిగించి చెమటలను నివారిస్తుంది. అంతేగాక చెమటలు దుర్గంధభరితంగా వున్నా తగ్గిపోతుంది. కరివేపాకును పొడిచేసుకుని వాడుకోవచ్చు.

కరివేపాకు పొడిని చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కరివేపాకు ఎక్కువ పాళ్లు వుండేవిధంగా వుంటే మంచి ఫలితం వుంటుంది. జీలకర్ర, ధనియాలు, ఎండబెట్టిన కరివేపాకు ఈ మూడింటినీ విడివిడిగా నేతిలో వేయించాలి. ఆ తర్వాత వీటిని దంచి, మెత్తగా అయిన తర్వాత సైంధవ లవణమును లేక ఉప్పును గాని తగినంత వేసి ఒక సీసాలో భద్రపరచుకోవాలి. ఏదైనా ఉపహారం తినేటప్పుడు అన్నములోనూ ఈ పొడిని కలుపుకొని తినవచ్చు. రోజుకు 5 లేక 6 చెంచాలు చొప్పున తీసుకుంటే కఫం వుండే వ్యాధులు నెమ్మదిస్తాయి. కరివేపాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

రక్తవిరేచనాలు, జిగట విరేచనాలు అవుతున్నప్పుడు కరివేపాకు పొడిని వట్టిది. వాడటం కంటే మజ్జిగలో కలుపుకుని రెండు లేక మూడుసార్లు వాడితే మంచి ఫలితం ఉంటుంది. రోజుకు రెండు లేక మూడు గ్లాసులు త్రాగితే వెంటనే ఫలితం కనబడుతుంది.

Know  More : Triphala Ayurvedic Benefits

కరివేపాకు చెట్టు బెరడు కూడా వైద్యానికి పనికి వస్తుంది. దీనిని మెత్తగా నూరి కాస్తంత నీరు కలిపి దురదలు, పొక్కులు వున్నప్పుడూ ఆ ప్రాంతాల్లో వ్రాసి ఆరిన తర్వాత స్నానం చేస్తే తగ్గుతాయి.

కరివేపాకును పాలలో వేసి ఉడికించి తాగితే కడుపులో పురుగులు పోతాయి. ఇంకా బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ ఏవైనా వుంటే తగ్గిపోతాయి.

కరివేపాకు చెట్టు బెరడు లేక కాయను బాగా ఎండబెట్టి దంచి మెత్తని చూర్ణం చేసి అతిగా చెమట పడుతుంటే లేక వేడి ఎక్కువగా వున్న వారు వాడితే మంచి ఫలితంఉంటుంది.

పొరబాటున ఆహార పదార్థాలలో విషప్రభావం గనుక వుంటే దానిని నివారించడానికి కరివేపాకు పొడిని ఎక్కువగా తినాలి. వీలైతే పచ్చి కరివేపాకును నమిలి రసాన్ని తాగుతున్నా విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….