Share:

Poppy Seeds / గసగసాలు

Poppy Seeds / గసగసాలు

గసగసాలు అతిగా వాడటం వల్ల వీర్యనష్టము జరుగుతుంది. లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది.

గసగసాలు దోరగా వేయించి పంచదార కలిపి ఉదయం, సాయంత్రం 3. -5 గ్రాములు తీసుకుంటే గుండెకు మంచిది.

రక్తముతో కూడిన జిగట విరేచనాలు అవుతుంటే గసగసాలను దోరగా వేయించి మెత్తగా దంచి, దానిలో తేనెగాని, నెయ్యిగాని వేసి పూటకు 3-5 గ్రాములు చొప్పున తీసుకుంటే విరేచనాలు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి.

నిద్రపట్టకపోవడం లేక కలత నిద్రలో మేల్కొవడం వంటివి పోవాలంటే గసగసాల్ని వేడి చేసి గుడ్డలో మూట కట్టి దానినివాసన చూడాలి. దీని వల్ల సుఖనిద్ర పడుతుంది.

Know More : 18 Home Remedies for Gallbladder Stone

గసగసాలు బలవకరం, శుక్రధాతువును పెంచి లైంగిక శక్తిని వృద్ధి చేస్తాయి. శీఘ్ర స్ఖలనాన్ని నిరోధిస్తాయి. వాత దోషాల్ని పోగొడతాయి. నెమ్ము, కుష్టు రోగాలకు యివి పథ్యం.

గసగసాలు నీళ్ళలో వేసి నూరి తీసిన రసాన్నే మనవాళ్ళు గసగసాల పాలు అని పిలుస్తారు. ఈ పాలలో పంచదార కలుపుకుని తాగితే విరేచనాలు ఠక్కున కడతాయి.

గసగసాలు, జీలకర్ర సమానంగా కలిపి వేయించి, రుచికి ఉప్పు, కారం కలుపుకుని రోజూ అన్నంలో రెండు, మూడు ముద్దలు తింటే అమీబియాసిస్ అనే జిగురు విరేచనాలు వ్యాధికి మంచి ఫలితం కనిపిస్తుంది. భోజనం చేయగానే విరేచనానికి వెళ్ళవలసి రావడం ఈ వ్యాధి లక్షణం. ఇవి ఉన్నప్పుడు ఈ పొడి తప్పకుండా ఫలితాన్నిస్తుంది. తరచూ విరేచనాలతో బాధపడే పిల్లలకు కూడా ఈ పొడి మంచిది.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….